iPhone Offers: నెవర్ బిఫోర్ డీల్ అమ్మ.. అతి తక్కువ ధరకు ఐఫోన్ 15 ప్రో..!

iPhone Offers: నెవర్ బిఫోర్ డీల్ అమ్మ.. అతి తక్కువ ధరకు ఐఫోన్ 15 ప్రో..!
x

iPhone Offers: నెవర్ బిఫోర్ డీల్ అమ్మ.. అతి తక్కువ ధరకు ఐఫోన్ 15 ప్రో..!

Highlights

భారతదేశంలోని ప్రతి యువకుడికి ఐఫోన్ కొనడం ఒక కల. అయితే, ఇతర ఫోన్‌లతో పోలిస్తే ఐఫోన్‌లు చాలా ఖరీదైనవి, అందువల్ల వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం.

iPhone Offers: భారతదేశంలోని ప్రతి యువకుడికి ఐఫోన్ కొనడం ఒక కల. అయితే, ఇతర ఫోన్‌లతో పోలిస్తే ఐఫోన్‌లు చాలా ఖరీదైనవి, అందువల్ల వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం. అయితే, ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రారంభించినప్పటి నుండి, పాత ఐఫోన్ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఐఫోన్ 15 ప్రో 128GB మోడల్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 15 ప్రో 128GB వేరియంట్ రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో లాంచ్ ధరలో సగం ధరకు అందుబాటులో ఉంది, ఇది ఐఫోన్ లవర్స్‌కు సువర్ణావకాశం. మీరు దీన్ని ఇప్పుడు రూ.58,000 కు ఆర్డర్ చేయవచ్చు. మీరు కొత్త ఐఫోన్‌ను ప్లాన్ చేస్తుంటే లేదా మీ బేస్ వేరియంట్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంటే, ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. ఈ ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్ సైట్‌లో 47శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది, దీని ధర రూ.58,103. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో బేస్ మోడల్ (128GB) ను రూ.1,09,900 కు విడుదల చేసింది. మీకు హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈఎమ్ఐలో ఐఫోన్ 15 ప్రోను కొనుగోలు చేస్తే, మీరు 7.5శాతం తక్షణ తగ్గింపును కూడా పొందుతారు, గరిష్టంగా రూ.7,500 వరకు. దీని వలన మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత సరసమైన ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 15 ప్రోలో టైటానియం బాడీ, A17 ప్రో చిప్, 6.1-అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే, 48MP ప్రైమరీ లెన్స్ , 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన మెరుగైన కెమెరా సిస్టమ్ ఉన్నాయి. ఇతర ఫీచర్లతో డైనమిక్ ఐలాండ్, USB-C ఛార్జింగ్, యాక్షన్ బటన్ ఉన్నాయి. దీనిని గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేశారు ఇది తేలికైనగా, దృడంగా ఉంటుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, HDR మద్దతుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. మీరు వివిధ ఫంక్షన్ల కోసం కొత్త యాక్షన్ బటన్‌ను కస్టమైజ్ చేయచ్చు. ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్, టైటానియం కలర్స్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విషయానికి వస్తే 48MP ప్రైమరీ షూటర్ ఉంది. 3x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కూడా ఉంది. ఇది 60 fps వద్ద 4K వరకు ProRes వీడియోను రికార్డ్ చేయగల 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. శక్తివంతమైన A17 ప్రో చిప్‌ ఉంది, ఇది కొత్త 6-కోర్ సీపీయూ, జీపీయూ కూడా ఉన్నాయి. బ్యాటరీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది, సాధారణ వాడకంతో పూర్తి రోజు ఉంటుంది. USB-C పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతుంది. డ్యూయల్ సిమ్ (నానో-సిమ్ , eSIM) మద్దతు ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3కి మద్దతు ఇస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories