iPhone 17e: ఐఫోన్ 17 సిరీస్‌.. బడ్జెట్ ధరలో త్వరలోనే లాంచ్..!

iPhone 17e
x

iPhone 17e: ఐఫోన్ 17 సిరీస్‌.. బడ్జెట్ ధరలో త్వరలోనే లాంచ్..!

Highlights

iPhone 17e: ఆపిల్ 2025లో విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది.

iPhone 17e: ఆపిల్ 2025లో విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ సిరీస్ లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 17 మోడల్స్ పవర్‌ఫుల్ పర్ఫామెన్స్, ప్రీమియం డిజైన్ తో మార్కెట్లో విపరీత ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇటీవలే టెక్ రంగంలో వచ్చిన అనధికారిక సమాచారం ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17eను తయారీకి సిద్ధపడుతోందని తెలిసింది. ఐఫోన్ 17 సిరీస్ లో ఇదే అత్యంత తక్కువ ధర ఫోన్. ఎందుకంటే ఈ ఫోన్.. ఐఫోన్ 16e మోడల్‌ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఐఫోన్ 17e ఆపిల్ ఫ్లాగ్‌షిప్ పర్ఫామెన్స్ స్టాండర్డ్స్‌కు మ్యాచ్ అవుతుంది.

లీక్స్ ప్రకారం.. ఐఫోన్ 17e ధర రూ.60,000 నుంచి రూ.65,000 మధ్య ఉండవచ్చు. ఈ ధరతో ఐఫోన్ 17eని ఆపిల్ ప్రీమియం మిడ్ రేంజ్ కేటగిరీలో పొజిషన్ చేస్తుంది. ఆపిల్ 128GB స్టోరేజ్ ఆప్షన్ మళ్లీ తొలగించవచ్చు. బేస్ మోడల్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రారంభం అవుతుంది. ఆపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రారంభ ధరను జస్టిఫై చేయవచ్చు. ఇండియన్ బయర్లకు ట్యాక్సెస్ కారణంగా స్లైట్ ధర వేరియేషన్ ఉండవచ్చు.

ఐఫోన్ 17eలో ఐఫోన్ 16e నుంచి చాలా డిజైన్ ఎలిమెంట్స్ రిటైన్ చేయవచ్చు. ఆపిల్ ఈసారి ఈ తక్కువ ధర మోడల్ బాడీ డిజైన్ సన్నని ఆకారంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. కెమెరా ఐలాండ్ ప్లేస్‌మెంట్‌లో స్లైట్ రిఫైన్‌మెంట్స్ రావచ్చు. మొత్తం డిజైన్ మార్పులు మినిమల్‌గా ఉంటాయి. ఆపిల్ “e” మోడల్స్‌కు సబ్టిల్ అప్‌డేట్స్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది.

డిస్‌ప్లే సైజ్, స్క్రీన్ టెక్నాలజీ ఎలా ఉంటాయి?

ఐఫోన్ 17eలో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ స్క్రీన్ సైజ్ ఆపిల్ స్టాండర్డ్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ సైజ్‌కు మ్యాచ్ అవుతుంది. డిస్‌ప్లే స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయవచ్చు. ధర కంట్రోల్ కోసం హై రిఫ్రెష్ రేట్స్ స్కిప్ చేయవచ్చు. OLED ప్యానెల్ స్ట్రాంగ్ కలర్ ఆక్యురసీ ఇస్తుంది. మొదట్లో రెండు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అవుతుంది. బ్లాక్, వైట్ కలర్స్ లాంచ్‌లో ఉండవచ్చు. ఆపిల్ తర్వాత అదనపు కలర్స్ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. కొత్త కలర్ ఆప్షన్స్ కొన్ని నెలల తర్వాత రావచ్చు. ఈ స్ట్రాటజీ వల్ల తొలి దశ తయారీ సాఫీగా సాగిపోతుంది.

లీక్స్ ప్రకారం.. ఐఫోన్ 17e ఇండియాలో ఫిబ్రవరి 2026లో లాంచ్ అవుతుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. మార్చి తొలి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆపిల్ లాంచ్ డేట్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. ఫైనల్ టైమ్‌లైన్స్ గ్లోబల్ సప్లై చైన్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఆపిల్ ఏ19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్ ఫ్యూయర్ జీపీయూ కోర్లు కలిగి ఉండవచ్చు. “e” మోడల్స్‌లో జీపీయూ పవర్ ఆపిల్ లిమిటెడ్ గా ఉంచుతుంది. డైలీ టాస్క్‌లకు పర్ఫామెన్స్ స్మూత్‌గా ఉంటుంది. గేమింగ్ పర్ఫామెన్స్ స్ట్రాంగ్ కానీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

బేస్ వేరియంట్‌లో 8GB ర్యామ్ ఉండవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ 128GB లేదా 256GB నుంచి ప్రారంభం అవుతుంది. ఫోన్ లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్‌పై రన్ అవుతుంది. లీక్స్ ప్రకారం ఫోన్ లో కొత్త iOS 26.2 ఉండొచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ స్ట్రాంగ్ అడ్వాంటేజ్. ఐఫోన్ 17eలో సింగిల్ 48MP రియర్ కెమెరా ఉండవచ్చు. ఆపిల్ సెంటర్ స్టేజ్ ఎనేబుల్డ్ సెన్సార్ ఉపయోగించవచ్చు. ఫ్రంట్ కెమెరా 24MP రిజల్యూషన్ ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో 4005mAh బ్యాటరీ ఉండవచ్చు. వైర్‌లెస్ చార్జింగ్ 7.5Wకు లిమిట్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories