iPhone 17e vs Pixel 10a vs Galaxy S25 FE: ఫీచర్లు, ధర.. ఏది కొంటే బెస్ట్?
కీలక ఫీచర్లు, ధరల పోలికతో iPhone 17e, Pixel 10a, Galaxy S25 FE — మీ డబ్బుకు ఏది బెస్ట్ ఆప్షన్?
apple iphone 17e: ఆపిల్ తన కొత్త బడ్జెట్ ఫ్లాగ్షిప్ iPhone 17eని శక్తివంతమైన A19 ప్రాసెసర్‌తో విడుదల చేసింది. రూ.70,000 లోపు ధరలో ఇది Google Pixel 10a, Samsung Galaxy S25 FE లతో పోటీ పడుతోంది. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డిస్ప్లే (Display)
iPhone 17e: 6.1-అంగుళాల OLED డిస్ప్లే, కానీ కేవలం 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంది. పాతకాలపు నాచ్ స్టైల్ డిజైన్‌నే ఇంకా కొనసాగిస్తోంది.
Pixel 10a: 6.3-అంగుళాల OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో మెరుగ్గా ఉంది.
Galaxy S25 FE: అన్నింటికంటే పెద్దదైన 6.7-అంగుళాల Dynamic AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
పెర్ఫార్మెన్స్ (Performance)
iPhone 17e: ఇందులో లేటెస్ట్ A19 చిప్సెట్ వాడారు. పెర్ఫార్మెన్స్ పరంగా మిగిలిన రెండింటి కంటే ఇది చాలా ముందుంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
Pixel 10a: గూగుల్ సొంత Tensor G4 చిప్సెట్తో వస్తుంది.
Galaxy S25 FE: ఇందులో Exynos 2400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
కెమెరా (Camera)
iPhone 17e: బ్యాక్ సైడ్ కేవలం ఒక్కటే 48MP కెమెరా ఉంది. ఈ విషయంలో ఆపిల్ వెనుకబడింది.
Pixel 10a: 48MP మెయిన్ + 13MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
Galaxy S25 FE: ఇది కెమెరాలో రారాజు. 50MP మెయిన్ + 12MP అల్ట్రా-వైడ్ + 8MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది.
బ్యాటరీ & ఛార్జింగ్ (Battery & Charging)
iPhone 17e: 20W వైర్డ్ ఛార్జింగ్ (చాలా నెమ్మది).
Pixel 10a: భారీ 5,100mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ముందుంది.
Galaxy S25 FE: 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
ఏది కొనాలి..
మీకు రూ.50,000 లోపు మంచి డిస్ప్లే, పెద్ద బ్యాటరీ కావాలంటే Pixel 10a బెస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు. మీకు నాచ్ డిజైన్, సింగిల్ కెమెరాతో ఇబ్బంది లేకపోతే, కేవలం స్పీడ్, ఆపిల్ ఎకోసిస్టమ్ కోసం iPhone 17e తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీ ముఖ్యమనుకునే వారికి, పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారికి Galaxy S25 FE సరైనదని అంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




