iQOO 15 Ultra: త్వరలోనే ఐకూ 15 అల్ట్రా లాంచ్.. ఫోన్‌లో క్యూలింగ్ ఫ్యాన్ పెట్టేశారు.. ధర ఎంతంటే..?

iQOO 15 Ultra: త్వరలోనే ఐకూ 15 అల్ట్రా లాంచ్.. ఫోన్‌లో క్యూలింగ్ ఫ్యాన్ పెట్టేశారు.. ధర ఎంతంటే..?
x

iQOO 15 Ultra: త్వరలోనే ఐకూ 15 అల్ట్రా లాంచ్.. ఫోన్‌లో క్యూలింగ్ ఫ్యాన్ పెట్టేశారు.. ధర ఎంతంటే..?

Highlights

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కు సబ్ బ్రాండ్ అయిన ఐకూ త్వరలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.

iQOO 15 Ultra: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కు సబ్ బ్రాండ్ అయిన ఐకూ త్వరలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఐకూ15 సిరీస్‌లో హై ఎండ్ మోడల్ అయిన ఈ ఫోన్ పేరు ఐకూ15 అల్ట్రా. ఈ డివైస్ అల్ట్రా- పర్‌ఫామెన్స్ స్మార్ట్‌ఫోన్‌గా పొజిషన్ చేయబడింది. గేమింగ్, సుదీర్ఘ పర్‌ఫామెన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టనుంది. ఐకూ చైనీస్ ప్లాట్‌ఫామ్ వీబోలో లాంచ్ హింట్స్ ఇచ్చింది. చైనీస్ న్యూ ఇయర్ ముందు ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా. చైనీస్ న్యూ ఇయర్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో 2026 ప్రారంభంలో లాంచ్ అవుతుందనే అంచనాలున్నాయి. మొదట చైనాలో అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ లాంచ్ గురించి స్పష్టత రాలేదు.

ఐకూ15 అల్ట్రాలో పెద్ద ప్రీమియం డిస్‌ప్లే ఉండవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. 6.85 ఇంచ్ శాంసంగ్ LTPO OLED ప్యానెల్ ఉంటుంది. 2K రిజల్యూషన్‌తో ఉండే అవకాశం ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, స్మూత్ స్క్రోలింగ్‌కు ఇది బాగుంటుంది. LTPO టెక్నాలజీ వల్ల పవర్ ఎఫిషియెన్సీ మెరుగుపడుతుంది. బ్రైట్‌నెస్, కలర్ అక్యూరసీపై కూడా దృష్టి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉండవచ్చు. ఫ్లాగ్‌షిప్ పర్‌ఫామెన్స్, గేమింగ్ వర్క్‌లోడ్స్‌కు రూపొందించబడింది. థర్మల్ ఎఫిషియెన్సీ, AI పర్‌ఫామెన్స్ మెరుగుపడుతుంది. బేస్ ఐకూ15లో కూడా ఇదే చిప్‌సెట్ ఉంది. అల్ట్రా మోడల్‌లో మరింత మెరుగైన ట్యూనింగ్ ఉండవచ్చు. గేమింగ్ సమయంలో సుదీర్ఘ పర్‌ఫామెన్స్ ఇస్తుంది.

ఐకూ15 అల్ట్రాలో అడ్వాన్స్‌డ్ గేమింగ్ హార్డ్‌వేర్ ఉండవచ్చు. యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. మెరుగైన హీట్ డిసిపేషన్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. థర్మల్ థ్రాట్లింగ్ తగ్గుతుంది. ఎక్కువ సమయం గేమింగ్ చేసేవారికి ఇది బాగుంటుంది. ఐకూ ఈస్పోర్ట్స్-గ్రేడ్ పర్‌ఫామెన్స్ ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెడుతుంది.ఐకూ15 అల్ట్రాలో బలమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని అంచనా. ఆప్టికల్ జూమ్ ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుంది.

మిగతా కెమెరా వివరాలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. గేమింగ్, కెమెరా రెండింటికీ సరిపడేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 7,000mAh ఉంటుందని అంచనా. పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా ధృవీకరించబడలేదు. ఐకూ ఫ్లాగ్‌షిప్‌లలో సాధారణంగా పెద్ద బ్యాటరీలు ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ లో కూలింగ్ ఫ్యాన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఐకూ15 అల్ట్రా బేస్ మోడల్ కంటే మెరుగైన ఫీచర్లు అందిస్తుంది. మెరుగైన కూలింగ్, గేమింగ్ పర్‌ఫామెన్స్ ఉంటాయి. కెమెరా ఫీచర్లు కూడా మెరుగుపడవచ్చు. పవర్ యూజర్లు, గేమర్లను ఆకర్షించాలని ఐకూ లక్ష్యంగా పెట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories