iQOO 15R: ఐకూ 15R షాకింగ్ ఫీచర్స్.. 7600mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ గుండెల్లో రైళ్లు..!

iQOO 15R: ఐకూ 15R షాకింగ్ ఫీచర్స్.. 7600mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ గుండెల్లో రైళ్లు..!
x

iQOO 15R: ఐకూ 15R షాకింగ్ ఫీచర్స్.. 7600mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ గుండెల్లో రైళ్లు..!

Highlights

iQOO 15R: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ భారత మార్కెట్లోకి తన పవర్‌ఫుల్ మొబైల్ ఐకూ 15R లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

iQOO 15R: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ భారత మార్కెట్లోకి తన పవర్‌ఫుల్ మొబైల్ ఐకూ 15R లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 24న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ ఫోన్ కోసం అమెజాన్‌లో ప్రత్యేక పేజీని కూడా సిద్ధం చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా గేమర్లను, ఎక్కువ సేపు ఫోన్ వాడే వారిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ ధర మరియు బ్యాటరీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

ఈ ఫోన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా దాని బ్యాటరీ సామర్థ్యమే. ఇందులో ఏకంగా 7600mAh భారీ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా, లావుగా ఉంటుంది. కానీ ఐకూ మ్యాజిక్ చేస్తూ కేవలం 7.9mm మందంతో చాలా సన్నగా ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్న అతి సన్నని ఫోన్ ఇదేనని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనివల్ల ఛార్జింగ్ టెన్షన్ లేకుండా గంటల తరబడి గేమ్స్ ఆడుకోవచ్చు.

ధర విషయానికి వస్తే, ఐకూ 15R రూ.50,000 లోపు ధరలో అందుబాటులోకి రానుంది. ఈ రేంజ్‌లో వన్‌ప్లస్ 15R ఫోన్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ పవర్‌ఫుల్ పర్‌ఫామెన్స్‌ను ఇస్తుంది. ముఖ్యంగా BGMI వంటి హెవీ గేమ్స్‌ను 144Hz స్పీడ్‌తో ఎక్కడా లాగ్ లేకుండా ఆడుకోవడానికి Q2 సూపర్‌కంప్యూటింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో జోడించారు.

సాఫ్ట్‌వేర్ విషయంలో కూడా ఐకూ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తుంది. దీనికి ఏకంగా నాలుగు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అంటే ఈ ఫోన్ కొంటే వచ్చే ఆరు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్లాగ్‌షిప్ లెవల్ అనుభూతిని కోరుకునే వారికి ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడిలా మారుతుంది.

ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 1.5K రిజల్యూషన్‌తో కూడిన 6.59 ఇంచ్ OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల భారీ బ్యాటరీ కూడా చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభించనుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే టెక్ ప్రియులకు ఫిబ్రవరి 24న రాబోయే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories