iQOO Z11 Turbo: ఐకూ Z11 టర్బో.. భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!

iQOO Z11 Turbo: ఐకూ Z11 టర్బో.. భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
x
Highlights

iQOO Z11 Turbo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఐకూ తమ Z11 సిరీస్‌లో భాగంగా కొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది.

iQOO Z11 Turbo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఐకూ తమ Z11 సిరీస్‌లో భాగంగా కొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. iQOO Z11 Turbo పేరుతో వచ్చిన ఈ డివైజ్ హై ఎండ్ స్పెసిఫికేషన్లు, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో గేమింగ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తుంది. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్ ధర, పూర్తి ఫీచర్లు, కీలక విషయాలు తెలుసుకుందాం.

ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2750×1260 రిజల్యూషన్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. TCL CSOT C9+ మెటీరియల్‌తో తయారైన ఈ స్క్రీన్, కళ్లకు ఇబ్బంది కలగకుండా చూడటానికి 1 నిట్ మినిమమ్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇక గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని 4320Hz PWM డిమ్మింగ్, 3200Hz టచ్ శాంప్లింగ్, 300Hz టెన్ ఫింగర్ టచ్ వంటి ఫీచర్లు అందించారు. స్క్రీన్‌కు స్కాట్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

ఇకపోతే iQOO Z11 Turbo పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దీనిలో Snapdragon 8 Gen 5(3nm) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు iQOO రూపొందించిన Q2 ఈ-స్పోర్ట్స్ చిప్, Monster Hyper-Core Engine, Ice Dome VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. LPDDR5X Ultra RAM, UFS 4.1 స్టోరేజ్‌తో కలిసి ఈ ఫోన్ AnTuTuలో 35.9 లక్షలకుపైగా స్కోర్ సాధించినట్లు కంపెనీ తెలిపింది. హెవీ గేమింగ్ సమయంలో కూడా స్టేబుల్ 60fps పనితీరు, తక్కువ పవర్ వినియోగం ఇస్తుందని పేర్కొంది.

కలర్ ఆప్షన్స్ ఇవే..

ఈ iQOO Z11 Turbo డిజైన్ పరంగా చూసుకుంటే.. ఫ్లోటింగ్ లైట్, హలో పింక్, స్కై వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. మిడ్‌నైట్ బ్లాక్ వేరియంట్‌లో ఫైబర్ గ్లాస్ బ్యాక్, మిగతా వేరియంట్స్‌లో గ్లాస్ బ్యాక్ ఇచ్చారు. అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో పాటు IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది.

ఇకపోతే కెమెరా సెక్షన్‌లో iQOO తొలిసారిగా 200MP మెయిన్ కెమెరాను అందించింది. దీనిలోని 4x ఫీచర్ వలన ఫొటో క్వాలిటీ తగ్గదు. అలాగే ఇది 50mm, 85mm ఫుల్ ఫోకల్ లెంగ్త్ పోర్ట్రెయిట్ సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది వైడ్ యాంగిల్ మోడ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ విషయంలో కూడా iQOO Z11 Turbo యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌ 7600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెండో తరం సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ వల్ల -20°C నుంచి 40°C వరకు స్థిరమైన పనితీరు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు గేమింగ్ సమయంలో వేడి తగ్గించే Direct Drive Power Supply 2.0 ఫీచర్ కూడా ఉంది.

iQOO Z11 Turbo ఫోన్ ధరలు 12GB + 256GB వేరియంట్‌కు సుమారు రూ.34,900 నుంచి ప్రారంభమై.. 16GB + 1TB వేరియంట్‌కు రూ.52,000 వరకు ఉన్నాయి. గతేడాది డిసెంబరు నెలలో చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ హ్యాండ్ సెట్ ఇప్పటికే యూజర్లను విపరీంతంగా ఆకట్టుకుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లు, ఆన్‌లైన్ వెబ్‌సైట్లలోనూ అందుబాటులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories