Jio: జియో కొత్త బంపర్‌ ప్లాన్‌.. 365 నాన్‌స్టాప్‌, ఉచితంగా ఎన్ని బెనిఫిట్స్‌ తెలుసా?

Jio
x

Jio: జియో కొత్త బంపర్‌ ప్లాన్‌.. 365 నాన్‌స్టాప్‌, ఉచితంగా ఎన్ని బెనిఫిట్స్‌ తెలుసా?

Highlights

Jio 365 Days Plan: ట్రయ్‌ ఆదేశాల మేరకు ఇటీవల వాయిస్ ఓన్లీ ప్లాన్స్ చాలా ప్రైవేట్ దిగ్గజ టెలికాం కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి.

Jio 365 Days Plan: జియో నుంచి బిగ్ ఆఫర్ .. ట్రయ్‌ ఆదేశాలకు మేరకు ఇటీవల టెలికాం దిగ్గజ కంపెనీలని వాయిస్ ఓన్లీ ప్లాన్స్ (VOP)ని అందుబాటులోకి తీసుకోవచ్చాయి. ఇది డేటా ఉపయోగించని వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుంది. కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ లు పంపించే వారికి ఇది ఎంత ఉపయోగకరం. అంటే మొత్తానికి ఫీచర్‌ ఫోన్‌లకు ఇవి బాగా సెట్ అవుతాయి. అయితే జియో ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లో రెండు చీపెస్ట్ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఎక్కువ మంది యూజర్లకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. అంతే కాదు దీని వ్యాలిడిటీ 365 రోజులు వర్తిస్తుంది.

జియో 84 రోజుల ప్లాన్ ..

జియో రూ.458 ధరతో 84 రోజుల ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పొందుతారు. అంతేకాకుండా జియో సినిమా, జియో టీవీ యాక్సెస్ కూడా ఉచితంగా కాంప్లిమెంటరీగా పొందుతారు. అయితే ఇది కేవలం కాలింగ్ ఎస్ఎంఎస్లు చేసుకునే వారికి మాత్రమే ఉపయోగకరం.

జియో 365 రోజుల ప్లాన్..

జియో రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వ్యాలిడిటీ 365 డేస్ ఉంటుంది. యూజర్స్‌ ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయినా దేశవ్యాప్తంగా చేసుకునే సదుపాయం ఉంది. ఇందులో 3600 ఉచిత ఎస్ఎంఎస్లు పొందుతారు. ఇది మాత్రమే కాకుండా జియో సినిమా, జియో టీవీ యాక్సెస్ కూడా పొందుతారు.

ఇక జియో ఇటీవలే రెండు రీఛార్జ్ ప్లాన్లను తొలగించిన సంగతి తెలిసిందే. రూ. 479 ప్లాన్, రూ. 1899 ప్లాన్.. రూ.1899 ప్లాన్ లో 24 జీబీ డేటా వ్యాలిడిటీ 336 రోజులు ఉంటుంది. ఇంకా రూ.479 ప్లాన్‌లో 6 జీబీ డేటాతో పాటు 84 డేస్ వ్యాలిడిటీ ప్లాన్ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories