Jio Recharge Plan: కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. జియోలో సూపర్ కాలింగ్ ప్లాన్

Jio Recharge Plan
x

Jio Recharge Plan: కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. జియోలో సూపర్ కాలింగ్ ప్లాన్

Highlights

Jio Recharge Plan: రిలయన్స్ జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీని అందించే ప్రత్యేక కాలింగ్-ఓన్లీ ప్లాన్‌ను అందిస్తోంది.

Jio Recharge Plan: జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ చెల్లుబాటును అందించే ప్లాన్ కోసం చూస్తున్న వారికి శుభవార్త. రిలయన్స్ జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీని అందించే ప్రత్యేక కాలింగ్-ఓన్లీ ప్లాన్‌ను అందిస్తోంది.

ఈ ప్లాన్ ముఖ్యంగా డేటా అవసరం లేని వినియోగదారులకు అనుకూలంగా రూపొందించబడింది. ఇంట్లో వై-ఫై ఉన్న వారు లేదా తల్లిదండ్రుల కోసం సిమ్‌ను ఉపయోగిస్తున్న వారు ఎక్కువగా ఈ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్ సదుపాయం మాత్రమే కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

రూ.1748 ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 3600 SMSల సౌకర్యం లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో మొబైల్ డేటా అందుబాటులో ఉండదు. అవసరమైతే ప్రత్యేకంగా డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 336 రోజుల చెల్లుబాటును పొందవచ్చు.

అదనంగా, ఈ జియో ప్లాన్‌తో జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తున్నారు. దీర్ఘకాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

ఇదే తరహా కాలింగ్-ఓన్లీ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ కూడా అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 SMSలతో పాటు స్పామ్ అలర్ట్స్, ఉచిత హలోట్యూన్స్, పెర్ప్లెక్సిటీ ప్రో AI వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

తక్కువ ధరలో దీర్ఘకాల వ్యాలిడిటీ కావాలనుకునే జియో వినియోగదారులకు రూ.1748 ప్లాన్ ఒక సూపర్ ఆప్షన్‌గా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories