July Smartphone Launches: ఇది కదా జాతరంటే.. ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి బ్రదర్.. లిస్ట్ అదిరిందిగా..!

July Smartphone Launches
x

July Smartphone Launches: ఇది కదా జాతరంటే.. ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి బ్రదర్.. లిస్ట్ అదిరిందిగా..!

Highlights

July Smartphone Launches: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చి తమ ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. ఇక ఈ జూన్ నెలలో పలు మొబైల్స్ లాంచ్ అయ్యాయి.

July Smartphone Launches: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చి తమ ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. ఇక ఈ జూన్ నెలలో పలు మొబైల్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ నెల పూర్తి అయింది. జూలైలో మరికొన్ని స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. జూలై ప్రారంభంలో భారత మార్కెట్‌తో సహా ఇతర మార్కెట్లలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే జూన్‌లో రిలీజ్ అయిన ఫోన్ల మొదటి సేల్ కూడా జూలై ప్రారంభంలో ఉండనుంది. అందువల్ల జూలై మొదటి వారంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

Nothing Phone 3

Nothing Phone 3 మొబైల్ జూలై 1న భారతదేశంలో లాంచ్ అయింది. ఇది 6.7 అంగుళాలు, LTPO OLED డిస్ప్లే‌ను కలిగి ఉంది. వెనుక వైపు- 50MP + 50MP + 50MP కెమెరా, ముందువైపు 50 MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,150mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ OS 3.5పై నడుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.


OnePlus Nord 5

OnePlus Nord 5 సిరీస్ భారతదేశంలో జూలై 8న లాంచ్ కానుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 5,200mAh బ్యాటరీ 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంటుంది. 6.83 అంగుళాలు, ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది.

వెనుక వైపు 50MP + 8MP కెమెరా, ముందువైపు 50 MP సెల్ఫీ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ OS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది.

OnePlus Nord CE 5

OnePlus Nord 5 తో పాటు, OnePlus Nord CE5 కూడా జూలై 8న లాంచ్ కానుంది. ఇది 6.77 అంగుళాలు, పూర్తి HD+ AMOLED డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఇందులో వెనుక భాగంలో 50MP + 8MP కెమెరా, ముందు వైపు16 MP సెల్ఫీ కెమెరా ఉంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీ అందించారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో వస్తుంది.


Samsung Galaxy Z Series

Samsung Galaxy Z Seriesలో భాగంగా జూలై 9న Samsung Galaxy Z Fold 7, Flip 7 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Galaxy Z Fold 7 ఫోన్ 8అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, 6.5అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో వస్తుంది. వెనుక కెమెరాలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Samsung Galaxy Z Flip 7

Samsung Galaxy Z Flip 7 ఫోన్ Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది 12GB RAM తో పాటు, మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో వచ్చే ఛాన్స్ ఉంది. అందులో -256GB, 512GB, 1TB ఉన్నాయి. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories