Lava Play Ultra 5G: లావా నుంచి ఫీచర్-రిచ్ ఫోన్‌.. గేమర్స్‌కు పండగే.. చీప్‌గా కొనండి..!

Lava Play Ultra 5G: లావా నుంచి ఫీచర్-రిచ్ ఫోన్‌.. గేమర్స్‌కు పండగే.. చీప్‌గా కొనండి..!
x
Highlights

Lava Play Ultra 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సరసమైన, ఫీచర్-రిచ్ ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

Lava Play Ultra 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సరసమైన, ఫీచర్-రిచ్ ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. నేడు లావా చౌకైన గేమింగ్ ఫోన్ లావా ప్లే అల్ట్రా మొదటి సేల్. ఈ ఫోన్ బడ్జెట్-ఫ్రెండ్లీ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు, ఇందులో బలమైన బ్యాటరీ, స్టైలిష్ డిజైన్, తాజా ఫీచర్లు ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, లావా అధికారిక వెబ్‌సైట్ వంటి ఈ-కామర్స్ సైట్‌ల నుండి కొనుగోలు చేయచ్చు. అదే సమయంలో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, నో-కాస్ట్ EMI వంటి ఆఫర్ల కారణంగా, కస్టమర్ల కోసం దాని ఆఫర్‌లు, ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Lava Play Ultra 5G Price And Offers

లావా ప్లే అల్ట్రా ఆర్కిటిక్ స్లేట్, ఆర్కిటిక్ ఫ్రాస్ట్ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది. భారతదేశంలో, లావా ప్లే అల్ట్రా 5G ప్రారంభ 6GB / 128GB మోడల్ ధర రూ. 14,999 కాగా, 8GB / 128GB వేరియంట్ ధర రూ. 16,499. లావా ప్లే అల్ట్రా 5G మొదటి సేల్‌లో ఫోన్‌పై రూ. 1,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ తర్వాత మీరు బేస్ వేరియంట్‌ను రూ. 13,999, రూ. 15,499 కు కొనుగోలు చేయగలరు.

Lava Play Ultra 5G Specifications

లావా నుండి వచ్చిన ఈ గొప్ప గేమింగ్ ఫోన్ శక్తి, సామర్థ్యం కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 (4nm) చిప్‌సెట్‌తో వస్తుంది. మీడియాటెక్ హైపర్ ఇంజిన్ టెక్నాలజీ గేమింగ్ FPSని 20శాతం వరకు మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ 120Hz, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.67″ AMOLED (FHD+) డిస్‌ప్లేతో వస్తుంది.

లావా ప్లే అల్ట్రా 5G 64MP సోనీ IMX682 మెయిన్ కెమెరా + 5MP మాక్రో సెన్సార్, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. నైట్, HDR, పోర్ట్రెయిట్, ప్రో, మాక్రో, డ్యూయల్ వ్యూ వీడియో మొదలైనవి. దీనితో పాటు ఫోన్‌కి 5000mAh బ్యాటరీ అందించారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 83 నిమిషాల్లో 0–100శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

ఫోన్ ఆండ్రాయిడ్ 15, 2 OS అప్‌డేట్‌లతో + 3 సంవత్సరాల భద్రతా ప్యాచ్ వాగ్దానంతో నడుస్తుంది. IP64 రేటింగ్ డస్ట్, వాటర్ నుండి ప్రొటక్షన్ అందిస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, USB-C, బ్లూటూత్ 5.2, Wi-Fi 6E, 3.5మి.మీ జాక్, గేమ్‌బూస్ట్ మోడ్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories