iPhone 17 Pro: ఐఫోన్ 17.. ఏకంగా రూ.22 వేలు డిస్కౌంట్..!

iPhone 17 Pro: ఐఫోన్ 17..  ఏకంగా రూ.22 వేలు డిస్కౌంట్..!
x

iPhone 17 Pro: ఐఫోన్ 17.. ఏకంగా రూ.22 వేలు డిస్కౌంట్..!

Highlights

ఆపిల్ తీసుకొచ్చిన ఐఫోన్ 17 ప్రో ఈ సిరీస్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ మోడల్‌గా మార్కెట్‌లో నిలిచింది. డిజైన్ పరంగా అప్‌డేటెడ్ లుక్ కనిపిస్తే, లోపల ఉన్న టెక్నాలజీ పూర్తిగా నెక్స్ట్ లెవల్‌గా ఉంది.

iPhone 17 Pro: ఆపిల్ తీసుకొచ్చిన ఐఫోన్ 17 ప్రో ఈ సిరీస్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ మోడల్‌గా మార్కెట్‌లో నిలిచింది. డిజైన్ పరంగా అప్‌డేటెడ్ లుక్ కనిపిస్తే, లోపల ఉన్న టెక్నాలజీ పూర్తిగా నెక్స్ట్ లెవల్‌గా ఉంది. ప్రీమియం సెగ్మెంట్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ ఫోన్ స్పీడ్, కెమెరా, డిస్‌ప్లే విషయంలో పెద్ద అప్‌గ్రేడ్‌తో వచ్చింది. రోజువారీ వాడకంలోనే కాదు, హెవీ యూజ్ చేసే వాళ్లకు కూడా ఇది స్ట్రాంగ్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అయితే ఈ ఫోన్ పై ఆఫర్ ఉండటంతో ఎందులో ఉందని వినియోగదారులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఫోన్‌లో ఏ19 ప్రో బయానిక్ చిప్‌సెట్ ఉంది. ఈ చిప్ కారణంగా గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ అన్నీ చాలా స్మూత్‌గా జరుగుతాయి. 6.3 అంగుళాల ఓఎల్‌ఈడి డిస్‌ప్లేలో 3000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఇవ్వడం వల్ల నేరుగా ఎండలో ఉన్నా స్క్రీన్ క్లారిటీ తగ్గదు. కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ 48 మెగాపిక్సెల్ రియర్ సెటప్ ప్రధాన హైలైట్. మెయిన్, అల్ట్రా వైడ్, టెలిఫోటో – మూడు కూడా 48 మెగాపిక్సెల్ కావడం వల్ల ఫోటోలు, వీడియోలు చాలా డీటెయిల్‌గా వస్తాయి. సెల్ఫీ కోసం 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సెంటర్ స్టేజ్ టెక్నాలజీతో వీడియో కాల్స్ సమయంలో యూజర్ కదిలినా ఫ్రేమ్‌లోనే ఉంటాడు.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ ఐఫోన్ 17 ప్రోపై ప్రస్తుతం మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ నిర్వహిస్తున్న ఆపిల్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. రిటైల్ లెవల్‌లోనే నేరుగా ధర తగ్గించారు. అంతేకాదు, అర్హత ఉన్న బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాని విలువపై అదనంగా బోనస్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలిపి చూసుకుంటే మొత్తంగా పెద్ద మొత్తంలో ఆదా చేసే ఛాన్స్ ఉంది.

ఆపిల్ అధికారిక స్టోర్‌లో ఐఫోన్ 17 ప్రో 256జీబీ అసలు ధర రూపాయలు 1,34,900. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రిటైల్ డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ధర రూపాయలు 1,25,490కి వస్తోంది. బ్యాంక్ ఆఫర్ రూపాయలు 4,000 వరకు ఉంటుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే అదనంగా రూపాయలు 9,000 వరకు బోనస్ ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కలిపితే మొత్తం తగ్గింపు రూపాయలు 22,000కు పైగా ఉంటుంది. అందుకే ఐఫోన్ కొనాలి అనుకునే వారు వెంటనే దీనిని అతి తక్కువతో మీ సొంతం చేసుకోండి.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే ఏడాది ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డీఆర్‌ఏఎం సరఫరా లోపం కారణంగా తయారీ ఖర్చులు పెరుగుతున్నాయని సమాచారం. ఇప్పటివరకు ఆపిల్‌కు మెమరీ సరఫరా చేస్తున్న శాంసంగ్, ఎస్కే హైనిక్స్ (Samsung, SK Hynix)తో ఉన్న ఒప్పందాలు 2026 జనవరిలో ముగియనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఉత్పత్తి ఖర్చు పెరిగితే, దాని ప్రభావం ఫోన్ ధరలపై పడే అవకాశం ఉంది. అందుకే, భారీ డిస్కౌంట్ లభిస్తున్న ఈ సమయంలో కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అవుతుంది. భవిష్యత్తులో ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు తీసుకునే నిర్ణయం నిజంగా లాభంగా మారే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories