Meta Layoffs: 1500 మంది ఉద్యోగులకు మెటా గుడ్‌బై.. ఏఐపై పూర్తి ఫోకస్

Meta Layoffs: 1500 మంది ఉద్యోగులకు మెటా గుడ్‌బై.. ఏఐపై పూర్తి ఫోకస్
x

Meta Layoffs: 1500 మంది ఉద్యోగులకు మెటా గుడ్‌బై.. ఏఐపై పూర్తి ఫోకస్

Highlights

Meta Layoffs: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మాతృసంస్థ అయిన మెటా ప్లాట్‌ఫామ్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

Meta Layoffs : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మాతృసంస్థ అయిన మెటా ప్లాట్‌ఫామ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో భాగంగా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో పనిచేస్తున్న సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది ఆ విభాగంలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం.

ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), మెటావర్స్ ప్రాజెక్టులపై పనిచేస్తున్న సిబ్బందిని ప్రభావితం చేయనున్నాయి. మెటా సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 78,000 ఉండగా.. ఈ కోతలు సంఖ్యాపరంగా చిన్నవే అయినప్పటికీ, మెటావర్స్ భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్‌వర్త్ (Andrew Bosworth) రియాలిటీ ల్యాబ్స్ విభాగ ఉద్యోగులను జనవరి 14న ఆల్-హ్యాండ్స్ మీటింగ్‌కు పిలిచారు. సాధారణంగా రిమోట్ వర్క్‌కు అవకాశం ఉండే ఈ విభాగంలో, అందరూ ప్రత్యక్షంగా హాజరవ్వాలని ఆదేశించడం గమనార్హం. ఉద్యోగ కోతల ప్రకటన అనంతరం ఈ సమావేశం జరగడంతో.. విభాగ భవిష్యత్తుపై కీలక ప్రకటనలు ఉండవచ్చని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

గత కొన్ని సంవత్సరాలుగా రియాలిటీ ల్యాబ్స్ విభాగం బిలియన్ల డాలర్ల నష్టాలను ఎదుర్కొంటోంది. క్వెస్ట్ హెడ్‌సెట్స్, హారిజన్ వరల్డ్స్, రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్ వంటి ఉత్పత్తులు ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే మెటా సంస్థ మెటావర్స్‌పై ఫోకస్ తగ్గించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ AI మోడల్స్, భారీ డేటా సెంటర్ల విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తోంది.

మెటా కంప్యూట్ ఇనిషియేటివ్‌లో భాగంగా ‘టెన్స్ ఆఫ్ గిగావాట్స్’ కంప్యూటింగ్ సామర్థ్యంతో భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి సంస్థ సిద్ధమవుతోంది. ఇది AI మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ మార్పులు మెటా భవిష్యత్ వృద్ధికి కీలకమైన వ్యూహాత్మక అడుగు అని సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories