Motorola Edge 60 Fusion 5G Sale: మోటరోలా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!

Motorola Edge 60 Fusion 5G Sale: మోటరోలా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఈరోజు భారతదేశంలో మొదటిసారిగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానుంది.

Vamsi Krishna
Published on: 16 April 2025 11:19 AM IST
Motorola Edge 60 Fusion 5G Sale
X

Motorola Edge 60 Fusion 5G Sale: మోటరోలా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!

Motorola Edge 60 Fusion 5G Sale: మోటరోలా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఈరోజు భారతదేశంలో మొదటిసారిగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీతో సహా అనేక ప్రత్యేకమైన ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. మొదటి సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్ కింద రూ.2,500 వరకు తగ్గింపును కూడా ఇస్తుంది.

Motorola Edge 60 Fusion 5G Sale Offers

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ద్వారా రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. మరొకటి 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. అయితే ఇప్పుడు ఐడిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి EMI సౌకర్యంతో రూ. 2000 అదనపు తగ్గింపు కూడా ఇస్తుంది. కాబట్టి మొత్తం మీద, ఆసక్తిగల కస్టమర్లు ఈ సరికొత్త మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ.20,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయచ్చు.

Moto Edge 60 Fusion 5G Features

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల pOLED (2712×1220 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోటోలు, వీడియోల కోసం ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇది f/1.8 ఎపర్చరుతో 50MP మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో 13MP అల్ట్రా వైడ్, మాక్రో లెన్స్‌ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32MP మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మెమరీని 1024GB వరకు పెంచుకోవచ్చు. దీని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, GPS, WiFi, 3.5mm ఆడియో జాక్, USB టైప్ C ఛార్జ్ పోర్ట్, AGPS/GPS, GLONASS, BDS, గెలీలియో సెన్సార్లు ఉన్నాయి.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story