Motorola Edge 60: మోటో మంటలు.. ఈరోజే కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే..?

Motorola Edge 60
x

Motorola Edge 60: మోటో మంటలు.. ఈరోజే కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే..?

Highlights

Motorola Edge 60: మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60ని ఈరోజు భారతదేశంలో అంటే జూన్ 10, 2025న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

Motorola Edge 60: మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60ని ఈరోజు భారతదేశంలో అంటే జూన్ 10, 2025న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, లాంచ్ కు ముందే, ఫోన్ ధర, ఇతర ఫీచర్లు వెల్లడయ్యాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 60 Price

మోటరోలా ఎడ్జ్ 60 ధర దాదాపు రూ. 23,000 ఉండవచ్చు. అయితే ఈ ధర అధికారిక ప్రకటన తర్వాతే నిర్ధారించబడుతుంది. భారతదేశంలో మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైన తర్వాత ఎడ్జ్ 60 అసలు ధర వెల్లడవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు గురించి మరిన్ని వివరాల కోసం, ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Motorola Edge 60 Specifications

మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K అమోలెడ్ ప్యానెల్‌ను పొందచ్చు. ఇది 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కూడా అందిస్తుంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని చెబుతున్నారుర, దీనిని UFS 2.2 స్టోరేజ్, LPDDR4X RAMతో జత చేయవచ్చు. ఈ ఫోన్ తాజా HelloUI స్కిన్ ఆధారంగా ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది.


ఇది అనేక AI ఫీచర్లను కూడా అందిస్తుంది. దీనికి 5,500 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. ఈ ఫోన్‌లో బ్లూటూత్ వెర్షన్ 5.4, వైఫై 6 కూడా ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే, ఈ ఫోన్ 50MP సోనీ LYT700C సెన్సార్,3x ఆప్టికల్ జూమ్‌తో 50 MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను పొందుతుందని భావిస్తున్నారు. దీనిలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories