Motorola edge 70 fusion: మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్.. మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే.. ధర ఎంతంటే..?

Motorola edge 70 fusion
x

Motorola edge 70 fusion: మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్.. మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే.. ధర ఎంతంటే..?

Highlights

Motorola edge 70 fusion: మోటరోలా (motorola) తన పాపులర్ Edge సిరీస్ ను మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది.

Motorola edge 70 fusion: మోటరోలా (motorola) తన పాపులర్ Edge సిరీస్ ను మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (motorola edge 70 fusion) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. లేక్స్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.

లీక్ ప్రకారం డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా.. పర్ఫార్మెన్స్, బ్యాటరీ విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాసెసర్ గా Snapdragon 7s Gen 3 చిప్‌ను ఉపయోగించనున్నట్లు లీక్ సమాచారం. అంతేకాదు బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా 5500mAh నుంచి భారీగా 7000mAhకి పెంచినట్లు సమాచారం. అలాగే 6.78 అంగుళాల 1.5K OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.

పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ 4nm టెక్నాలజీపై రూపొందిన Snapdragon 7s Gen 3 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రానుంది. దీనితో పాటు Adreno 720 GPU, 8GB లేదా 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయని సమాచారం. ఈ మొబైల్ Android 16పై పనిచేస్తూ 3 సంవత్సరాల OS అప్డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ను అందించనుంది. కెమెరా vibagamloSony LYTIA సెన్సార్‌తో 50MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాలు ఉండనున్నాయి. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉంటుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు.

ఈ ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, అలాగే IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు ఉండటం మరో హైలైట్. కనెక్టివిటీకి 5G SA/NSA, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ పరంగా 7000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుందని లీక్ పేర్కొంది. డిజైన్ విషయంలో ఈ ఫోన్ నైలాన్ అండ్ లినెన్ ఇన్‌స్పైర్డ్ బ్యాక్ ఫినిష్తో ఓరియంట్ బ్లూ, స్పోర్టింగ్ గ్రీన్, బ్లూ సర్ఫ్, కంట్రీ ఎయిర్, సీల్హౌఎట్టే కలర్స్‌లో వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories