Motorola G96 5G: ఫ్లిప్‌కార్ట్ సేల్.. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది..!

Motorola G96 5G: ఫ్లిప్‌కార్ట్ సేల్.. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది..!
x

Motorola G96 5G: ఫ్లిప్‌కార్ట్ సేల్.. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది..!

Highlights

దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ ప్రారంభమయ్యాయి.

Motorola G96 5G: దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి ధమాకా సేల్ ప్రకటించింది. సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. మోటరోలా G96 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఇప్పుడు డిస్కౌంట్లతో కేవలం రూ.15,000. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మోటరోలా G96 ధర రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది, అయితే దాని టాప్ వేరియంట్ రూ.22,999కి రిటైల్ అవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీని ధర రూ.15,999కి పడిపోయింది. అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో అదనంగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే అదనపు తగ్గింపు కూడా పొందచ్చు. ఈ తగ్గింపు అనేది పాత ఫోన్ కండిషన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. మోటరోలా G96 రెండు వేరియంట్లలో లభిస్తుంది.128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్. ఆష్లీ బ్లూ, డ్రెస్డెన్ బ్లూ, ఆర్చిడ్, గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లతో వస్తుంది.

మోటరోలా G96 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల FHD+ 10-బిట్ 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో మృదువైన, ప్రకాశవంతమైన వ్యూ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది వేగవంతమైన పనితీరును హామీ ఇస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50MP సోనీ లైటియా 700C మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది, ఇది క్లియర్, క్లారిటీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. అలానే 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో UI పై రన్ అవుతుంది. కంపెనీ మూడు సంవత్సరాల సేఫ్టీ అప్‌డేట్లు ఇస్తుంది. అదనంగా, ఫోన్ IP68 రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories