Mosquito Killer Lamp: నో కెమికల్స్.. ఈ డివైజ్‎తో వానాకాలంలో దోమలకు చెక్ పెట్టండి

Mosquito Killer Lamp
x

Mosquito Killer Lamp: నో కెమికల్స్.. ఈ డివైజ్‎తో వానాకాలంలో దోమలకు చెక్ పెట్టండి

Highlights

Mosquito Killer Lamp: వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఇళ్లలో విపరీతంగా పెరుగుతుంది. నిలిచి ఉన్న నీరు, తేమ, ఉక్కపోత కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి.

Mosquito Killer Lamp: వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఇళ్లలో విపరీతంగా పెరుగుతుంది. నిలిచి ఉన్న నీరు, తేమ, ఉక్కపోత కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు దోమల వల్లనే వస్తాయి. వీటి నుంచి రక్షణ పొందడానికి చాలా మంది కాయిల్స్, స్ప్రేలు లేదా లిక్విడ్స్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి దోమలను చంపడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా హానికరంగా మారతాయి. అయితే, ఇప్పుడు ఈ విషపూరిత రసాయనాల అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్‌లో మస్కిటో కిల్లర్ ల్యాంప్ అందుబాటులో ఉంది. ఇది దోమల బెడదను పూర్తిగా తగ్గిస్తుంది. దీని ధర కూడా అంత ఎక్కువేమీ కాదు.

మస్కిటో కిల్లర్ ల్యాంప్ అంటే ఏమిటి?

ఇది యూఎస్‌బీ ద్వారా నడిచే ఒక ఎలక్ట్రిక్ ల్యాంప్. ఇది యూవీ లైట్ సాయంతో దోమలను తన వైపు ఆకర్షించి, వాటిని బంధించి చంపేస్తుంది. ఇంట్లో పొగ, వాసన లేదా రసాయనాలు లేకుండా దోమల నుండి విముక్తి పొందాలనుకునే వారి కోసం ఈ డివైజ్ ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఈ డివైజ్ ప్రత్యేకతలు

ఇందులో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేదా స్ప్రేలు ఉండవు, కాబట్టి ఇది పిల్లలకు, పెంపుడు జంతువులకు కూడా సురక్షితం. దోమలు ఈ డివైజ్ నుండి వచ్చే నీలం యూవీ లైట్‌కి ఆకర్షితులై, అందులో అమర్చిన ఫ్యాన్ సాయంతో లోపలికి లాగబడతాయి. దీనిని ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ లేదా ఏదైనా యూఎస్‌బీ పోర్ట్ నుండి నడపవచ్చు. అంటే విద్యుత్ గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఇది షాక్ కొట్టడం లేదా పేలుడుకు దారీయదు. చాలా సైలెంటుగా దోమలను చంపేస్తుంది. క్రింద వైపు రిమూవబుల్ కంటైనర్ ఉంటుంది. ఇందులో చనిపోయిన దోమలు పడతాయి. దీనిని సులభంగా తీసి శుభ్రం చేసుకోవచ్చు.

ల్యాంప్‌ను ఎలా ఉపయోగించాలి?

డివైజ్‌ను యూఎస్‌బీ కేబుల్ ద్వారా ఏదైనా ఛార్జింగ్ సోర్స్‌కి కనెక్ట్ చేయాలి. గదిలో తక్కువ వెలుతురు ఉన్న చోట దీనిని ఉంచండి. తలుపులు, కిటికీలు మూసివేసి, కొంతసేపు ల్యాంప్‌ను ఆన్‌లో ఉంచండి. కొన్ని గంటల్లో దోమలు తగ్గినట్లు లేదా కంటైనర్‌లో చిక్కుకుంటాయి.

ఎక్కడ కొనాలి?

దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లేదా స్థానిక ఎలక్ట్రానిక్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర సుమారు రూ.500 నుండి రూ.1500 వరకు ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories