OnePlus 12 5G: భారీగా ధర తగ్గిన వన్‌ప్లస్ ఫోన్.. తొలిసారిగా అత్యంత చౌకగా లభ్యం..!

OnePlus 12 5G
x

OnePlus 12 5G: భారీగా ధర తగ్గిన వన్‌ప్లస్ ఫోన్.. తొలిసారిగా అత్యంత చౌకగా లభ్యం..!

Highlights

OnePlus 12 5G: వన్‌ప్లస్ 12 5జీ ధర మరోసారి భారీగా తగ్గింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

OnePlus 12 5G: వన్‌ప్లస్ 12 5జీ ధర మరోసారి భారీగా తగ్గింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ, 16జీబీ ర్యామ్ + 512జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదలైంది. వన్‌ప్లస్ 13 విడుదలైన తర్వాత ఈ ఫోన్‌ ధర తగ్గడం ప్రారంభమైంది. కాబట్టి వన్‌ప్లస్ 12 5జీ స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

రూ. 64,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఉంది. అయితే ఇప్పడు రూ.8,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.56,999 ధరతో కొనుగోలు చేయచ్చు. అదనంగా, ఫోన్ కొనుగోలుపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను ఎమరాల్డ్, వైట్, బ్లాక్ అనే మూడు కలర్స్ వేరియంట్స్‌లో ఉంటుంది.

వన్‌ప్లస్ 12 5జీలో 6.82-అంగుళాల 120Hz ProXDR డిస్‌ప్లే ఉంది. ఫోన్ డిస్‌ప్లే‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ ఉంది. అంతేకాకుండా ఇది HDR10తో సహా అనేక ప్రో గ్రేడ్ ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే గరిష్టంగా 4,500 నిట్‌ల బ్రైట్‌నెస్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. ఈ డిస్‌ప్లే రిజల్యూషన్ FHD+ అంటే 3168 x 1440 పిక్సెల్స్.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కంపెనీ ఫోన్‌లో 16జీబీ ర్యామ్+ 512జీబీ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్‌ను అందించింది. ఈ వన్‌ప్లస్ ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్‌ఎఫ్‌సి, 5 జి, 4 జి వంటి కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అలానే AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

వన్‌ప్లస్ 12 5జీలో 5,400 mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి 100W SuperVOOC ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. అదేవిధంగా, ఇది 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌కు IP67 రేటింగ్‌ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14‌లో పనిచేస్తుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 50MP Sony LYT 808 ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. అంతేకాకుండా, ఈ ఫోన్‌లో 64MP 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంది. ఫోన్‌లో 48MP కెమెరా కూడా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్, 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP కెమెరా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories