OnePlus 13s Launch: ఫీచర్లు, డిజైన్ తెలిసిపోయింది.. సరికొత్త చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ 13ఎస్.. లాంచ్ ఎప్పుడంటే..?

OnePlus 13s Launch: ఫీచర్లు, డిజైన్ తెలిసిపోయింది.. సరికొత్త చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ 13ఎస్.. లాంచ్ ఎప్పుడంటే..?
x

OnePlus 13s Launch: ఫీచర్లు, డిజైన్ తెలిసిపోయింది.. సరికొత్త చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ 13ఎస్.. లాంచ్ ఎప్పుడంటే..?

Highlights

OnePlus 13s Launch: వన్‌ప్లస్ తన తదుపరి స్మార్ట్‌ఫోన్ "OnePlus 13s‌"ను త్వరలో భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి అధికారిక టీజర్‌ను షేర్ చేసింది. దాని డిజైన్, కలర్ ఆప్షన్లు, కొన్ని ముఖ్యమైన ఫీచర్లను వెల్లడించింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుంది. ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్, కొత్త షార్ట్‌కట్ కీ కూడా ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం

OnePlus 13s Design And Colors

కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో OnePlus 13s లాంచ్‌ను ప్రకటించింది. దీని ఖచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టీజర్ 'త్వరలో వస్తుంది' ట్యాగ్‌తో పాటు దాని వెనుక డిజైన్ కూడా వెల్లడికానుంది. ఈ ఫోన్ బ్లాక్, రోజ్ కలర్స్‌లో లాంచ్ అవుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయిన OnePlus 13Tని పోలి ఉంటుంది.

OnePlus 13s Specifications

వన్‌ప్లస్ 13s స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌‌తో రన్ అవుతుందని వన్‌ప్లస్ ధృవీకరించింది. 6.32-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, 1,264×2,640 పిక్సెల్‌లు, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్, కొత్త షార్ట్‌కట్ కీ ఉంటాయి, ఇది సాంప్రదాయ అలర్ట్ స్లైడర్ స్థానంలో వస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇందులో రెండు 50మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్లు, 16Mp సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇది కాకుండా, దీనికి 6,260mAh బ్యాటరీ అందించారు. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

అలర్ట్ స్లయిడర్‌కు బదులుగా షార్ట్‌కట్ బటన్‌‌తో వస్తున్న మొదటి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ OnePlus 13s అవుతుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కలర్‌ఓఎస్ 15.0 ఆధారంగా ఆండ్రాయిడ్ 15 ఉంటాయి. ఈ ఫోన్‌లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories