OnePlus Ace6: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. 7800mAh సూపర్‌ లార్జ్ బ్యాటరీతో వచ్చేస్తోంది..!

OnePlus Ace6
x

OnePlus Ace6: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. 7800mAh సూపర్‌ లార్జ్ బ్యాటరీతో వచ్చేస్తోంది..!

Highlights

OnePlus Ace6: వన్ ప్లస్ సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace6 ను అక్టోబర్ 27న చైనాలో OnePlus 15 తో పాటు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది.

OnePlus Ace6: వన్ ప్లస్ సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace6 ను అక్టోబర్ 27న చైనాలో OnePlus 15 తో పాటు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ మొబైల్ కీలక వివరాలు చైనా టెలికాం వెబ్‌సైట్‌లో ముందుగానే లీక్ అయ్యాయి. OPPO PLQ110 మోడల్ నంబర్‌తో ఈ మొబైల్ ఈ లిస్టింగ్ ఫోన్ సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్లను మొదటిసారిగా బయటకు వచ్చాయి. OnePlus ఇప్పటికే క్విక్‌ సిల్వర్, ఫ్లాష్ వైట్ , రేసింగ్ బ్లాక్రంగులను ఫోన్‌కు ప్రకటించింది.


చైనా టెలికాం లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కొలతలు (dimensions), బరువు (weight), గ్లాస్ బ్యాక్ వివరాలు ధృవీకరించబడ్డాయి. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుందని, అలాగే IP66/68/69/69K పూర్తి దుమ్ము, నీటి నిరోధకత రేటింగ్‌లను కలిగి ఉంటుందని ప్రకటించింది. అంతేకాకుండా ఈ విభాగంలోనే అతిపెద్ద 7800mAh సూపర్‌ లార్జ్ బ్యాటరీతో వస్తుందని తెలిపింది. ఈ ఫోన్ ఇటీవలే Geekbench లిస్టింగ్‌లో కూడా కనిపించి, అద్భుతమైన స్కోర్‌లతో పాటు 16GB RAM ను కలిగి ఉంటుందని వెల్లడించింది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను 2800×1272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. దీనికి ఆక్టా కోర్ Snapdragon 8 Elite 3nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ తో పాటు Adreno 830 GPU కలిగి ఉంది. మెమరీ, స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 12GB / 16GB LPDDR5X ర్యామ్, 256GB / 512GB / 1TB UFS 4.1 స్టోరేజ్ ఎంపికలలో లభిస్తుంది. అలాగే కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 8MP 120° అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 4K 60 fps వీడియో రికార్డింగ్‌కు మద్దతిస్తుంది. ముందువైపు 16MP కెమెరా ఉంది.

ఈ మొబైల్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ColorOS 16 ఇంటర్‌ఫేస్‌తో పనిచేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అదనంగా ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. ఆడియో కోసం USB Type-C పోర్ట్‌తో పాటు స్టీరియో స్పీకర్లు అందించబడ్డాయి. ఈ మొబైల్ ప్రధాన ఆకర్షణ 7800mAh బ్యాటరీ, 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగి ఉంది. ఇక కనెక్టివిటీ ఎంపికలలో 5G SA/NSA, Dual 4G VoLTE, అత్యాధునిక Wi-Fi 7, Bluetooth 5.4, NFC మరియు USB Type-C 2.0 ఉన్నాయి. OnePlus Ace6 స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB వేరియంట్లలో లభించనుంది. ఇక ధరల వివరాలు వచ్చే వారం అధికారికంగా ఫోన్ విడుదలైనప్పుడు తెలుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories