OnePlus Nord CE5 5G: వన్‌ప్లస్ నుంచి 'బ్యాటరీ బాహుబలి'.. 7100mAh బ్యాటరీతో నార్డ్ CE5 5Gపై కళ్ళు చెదిరే ఆఫర్లు!

OnePlus Nord CE5 5G: వన్‌ప్లస్ నుంచి బ్యాటరీ బాహుబలి.. 7100mAh బ్యాటరీతో నార్డ్ CE5 5Gపై కళ్ళు చెదిరే ఆఫర్లు!
x
Highlights

వన్‌ప్లస్ నార్డ్ CE5 5G పై భారీ ఆఫర్లు. 7100mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్న ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లతో రూ. 22,999 కే పొందవచ్చు.

మీరు స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు వన్‌ప్లస్ నుంచి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. భారీ బ్యాటరీ బ్యాకప్ మరియు ప్రీమియం ఫీచర్లతో వన్‌ప్లస్ తన OnePlus Nord CE5 5G మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ‘వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్’ (OnePlus Freedom Sale) లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు మరియు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ధర మరియు అదిరిపోయే ఆఫర్లు

ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 24,999 కాగా, సేల్‌లో భాగంగా ప్రస్తుతం రూ. 24,499 కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధరను మరింత తగ్గించుకోవచ్చు:

బ్యాంక్ డిస్కౌంట్: HDFC లేదా Axis Bank క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఫైనల్ ధర: అన్ని ఆఫర్లు పోను ఈ ఫోన్ మీకు కేవలం రూ. 22,999 కే దక్కుతుంది.

EMI సదుపాయం: నెలకు రూ. 4,083 చొప్పున 6 నెలల నోకాస్ట్ ఈఎంఐ (No Cost EMI) ఆప్షన్ కూడా ఉంది.

అదనపు ప్రయోజనాలు: ఫోన్‌తో పాటు ఉచితంగా మాగ్నెటిక్ కేస్ మరియు డిస్‌ప్లేపై లైఫ్ టైమ్ వారంటీని కంపెనీ అందిస్తోంది.

OnePlus Nord CE5 5G టాప్ ఫీచర్లు

ఈ ఫోన్ కేవలం బ్యాటరీ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ పరంగానూ అగ్రస్థానంలో ఉంది:

భారీ బ్యాటరీ: దీనిలోని 7,100mAh బ్యాటరీ ఈ ఫోన్ కే హైలైట్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సామాన్య వినియోగదారులకు 3 రోజుల వరకు బ్యాకప్ వస్తుంది. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

డిస్‌ప్లే: 6.77 అంగుళాల భారీ AMOLED స్క్రీన్‌తో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

ప్రాసెసర్: వేగవంతమైన పనితీరు కోసం మీడియాటెక్ డైమన్షిటీ 8350 అపెక్స్ (MediaTek Dimensity 8350 Apex) ప్రాసెసర్‌ను అమర్చారు.

కెమెరా: అదిరిపోయే ఫోటోల కోసం 50MP మెయిన్ కెమెరా మరియు అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం కూడా హై-క్వాలిటీ కెమెరాను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories