OpenAI: త్వరలో భారత్‌లో తొలి ఆఫీస్‌, ‘చాట్‌జీపీటీ గో’ సర్వీసులు కూడా..!

OpenAI: త్వరలో భారత్‌లో తొలి ఆఫీస్‌, ‘చాట్‌జీపీటీ గో’ సర్వీసులు కూడా..!
x

OpenAI: First Office in India Soon, Along with ‘ChatGPT Go’ Services!

Highlights

OpenAI in India: చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐ త్వరలో భారత్‌లో మొదటి ఆఫీస్‌ ప్రారంభించనుంది. AI విస్తరణ, ChatGPT వినియోగం, కొత్త సేవలు ‘ChatGPT Go’ గురించి పూర్తి వివరాలు.

చాట్‌జీపీటీ మాతృసంస్థ OpenAI భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత్‌లో ChatGPT వినియోగం వేగంగా పెరుగుతుండటమే ఈ నిర్ణయానికి కారణమైంది.

శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు

ఓపెన్‌ ఏఐ సీఈఓ Sam Altman మాట్లాడుతూ – “భారత్‌లో AIకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రతిభ, డెవలపర్ ఎకోసిస్టమ్, ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు – ఇవన్నీ కలిపి భారత్‌ను గ్లోబల్‌ AI లీడర్‌గా నిలబెడతాయి. న్యూఢిల్లీలో మొదటి ఆఫీస్‌ను ఏర్పాటు చేయడం, స్థానిక టీమ్‌ను నిర్మించడం భారత్‌లో AI విస్తరణకు మొదటి అడుగు” అని అన్నారు.

ఇండియాఏఐ మిషన్‌తో భాగస్వామ్యం

ఇప్పటికే OpenAI – IndiaAI Mission భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రభుత్వానికి అవసరమైన AI సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. భారత్‌లో లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, డెవలపర్లు రోజూ ChatGPT వాడుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది.

భారత్‌లో రెండో అతిపెద్ద మార్కెట్

తాజా డేటా ప్రకారం, ChatGPT వినియోగంలో భారత్‌ అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్. గత ఏడాదితో పోలిస్తే వారానికోసారి యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 4 రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-5 డెవలపర్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. అదేవిధంగా, విద్యార్థులు అత్యధికంగా వాడే దేశం కూడా భారత్‌గానే నిలిచింది.

‘ChatGPT Go’ – కొత్త ప్లాన్

భారత్‌ యూజర్ల కోసం ఓపెన్‌ ఏఐ ‘ChatGPT Go’ పేరుతో కొత్త సర్వీస్‌ను ప్రకటించింది. నెలకు రూ.399కే అందుబాటులో ఉండే ఈ ప్లాన్‌లో:

  1. మెసేజ్‌లు, ఇమేజ్‌ జనరేషన్‌, ఫైల్‌ అప్‌లోడ్‌ల పరిమితి భారీగా పెరుగుతుంది
  2. ఇండిక్‌ లాంగ్వేజీ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది
  3. UPI Payments సౌకర్యం కల్పించబడింది

భారత్‌లో కార్యాలయం ప్రారంభం, కొత్త ప్లాన్స్‌, పెరుగుతున్న యూజర్ బేస్‌తో OpenAI – ChatGPT భవిష్యత్తులో AI రంగంలో మరింత ప్రభావం చూపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories