Oppo Reno 14 Pro Launch: మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనండి..!

Oppo Reno 14 Pro Launch: మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనండి..!
x

Oppo Reno 14 Pro Launch: మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనండి..!

Highlights

oppo reno 14 pro launched with mediatek dimensity 8450 processor

Oppo Reno 14 Pro Launch: ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 14 ప్రోను మే 15న చైనాలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. చైనీస్ టెక్ బ్రాండ్ రెనో 14 ప్రో ముఖ్య స్పెసిఫికేషన్లను వెల్లడిస్తూ ఆన్‌లైన్‌లో కొన్ని టీజర్‌లను పంచుకుంది. ఒప్పో రెనో 14 ప్రోలో 6.83-అంగుళాల స్క్రీన్, సన్నని బెజెల్స్ ఉన్నాయని నిర్ధారించింది. గత సంవత్సరం రెనో 13 ప్రోతో పోలిస్తే ఇది బ్యాటరీలో అప్‌గ్రేడ్‌తో వస్తుంది. ఇది మూడు రంగులలో లభిస్తుం. 16జీబీ వరకు ర్యామ్, 1టీవీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అదనంగా, రెనో 14 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ఉంటుందని భావిస్తున్నారు.

Oppo Reno 14 Pro Launch Specifications

రెనో 14 ప్రోలో 6.83-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఇరుకైన బెజెల్స్‌తో,మధ్యలో హోల్-పంచ్ కటౌట్ ఉంటుందని ఒప్పో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో ధృవీకరించింది. ఇందులో పెద్ద 6,200mAh బ్యాటరీ ఉంటుంది, ఇది మునుపటి మోడల్ రెనో 13 ప్రో 5,800mAh బ్యాటరీ కంటే చాలా ఎక్కువ.

కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఒప్పో రెనో 14 ప్రోలో 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది, అయితే రెనో 13 ప్రోలో ఈ కెమెరా 8 మెగాపిక్సెల్స్ మాత్రమే. కొత్త సెన్సార్ సామర్థ్యాలను చూపించే కొన్ని కెమెరా నమూనాలను కూడా కంపెనీ పంచుకుంది.

ఒప్పో రెనో 14 ప్రో లాంచ్ మే 15న చైనాలో స్థానిక సమయం సాయంత్రం 4 గంటలకు (IST మధ్యాహ్నం 1:30 గంటలకు) జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రెనో 14 స్టాండర్డ్ వేరియంట్, ఒప్పో ఎన్కో క్లిప్ ఇయర్‌బడ్స్, ఒప్పో ప్యాడ్ SE టాబ్లెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు.

Oppo Reno 14 Pro Color Variants

ఒప్పో రెనో 14 ప్రో మూడు కలర్స్‌లో లభిస్తుంది. వీటిలో కల్లా లిల్లీ పర్పుల్, మెర్మైడ్, రీఫ్ బ్లాక్ కలర్ ఎంపికలు ఉన్నాయి.

Oppo Reno 14 Pro Storage Variants

1. 12 జీబీ + 256 జీబీ

2. 12 జీబీ + 512 జీబీ

3. 16 జీబీ + 512 జీబీ

4. 16 జీబీ + 1 టీబీ

Show Full Article
Print Article
Next Story
More Stories