
OTT Ban : బ్యాడ్ న్యూస్..ఇక ఈ ఐదు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కనిపించవు..!
OTT Ban: పదేపదే హెచ్చరికలు జారీ చేసినా అభ్యంతరకరమైన, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 5 OTT ప్లాట్‌ఫామ్‌లను భారత్‌లో తక్షణమే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
OTT Ban: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచవ్యాప్త వినోదం మన కళ్లముందు ఉంటోంది. అయితే, వినోదం పేరుతో అశ్లీలతను, సామాజిక విలువలకు విరుద్ధమైన కంటెంట్‌ను వడ్డిస్తున్న కొన్ని ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కంటెంట్ క్రియేటర్లకు స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదని గట్టి సందేశాన్ని పంపింది.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. పదేపదే హెచ్చరికలు జారీ చేసినా అభ్యంతరకరమైన, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 5 OTT ప్లాట్‌ఫామ్‌లను భారత్‌లో తక్షణమే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ జాబితాలో ఉన్నవి.
మూడ్ఎక్స్ వీఐపీ (MoodX VIP)
కోయల్ ప్లేప్రో (Koal PlayPro)
డిజి మూవీప్లెక్స్ (Digi Movieplex)
ఫీల్ (Feel)
జుగ్ను (Jugnu)
ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన వెబ్సైట్లు, యాప్‌లు ఇకపై ఇండియాలో అందుబాటులో ఉండవు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 మరియు ఐటీ చట్టంలోని సెక్షన్ 69Aని ప్రయోగించింది. ఈ సెక్షన్ కింద.. దేశ భద్రతకు, పబ్లిక్ ఆర్డర్‌కు లేదా సామాజిక నైతికతకు విఘాతం కలిగించే ఆన్లైన్ కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. గత కొన్ని ఏళ్లుగా ప్రేక్షకులు థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీలపై ఆధారపడుతున్నారు. వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ పేరుతో సెన్సార్ లేని కంటెంట్‌ను కొన్ని సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. కుటుంబంతో కలిసి చూడలేని విధంగా, అశ్లీలతకు పెద్దపీట వేస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వం తీసుకున్న చర్యను సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు కంటెంట్ విషయంలో స్వేచ్ఛ ఉంది, కానీ అది సామాజిక నిబంధనలను, భారతీయ విలువలను అతిక్రమించకూడదు అని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఐదు ప్లాట్‌ఫామ్‌ల నిషేధం కేవలం ఒక చర్య మాత్రమే కాదు, ఇతర దిగ్గజ ఓటీటీ సంస్థలకు కూడా ఒక హెచ్చరిక. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి సంస్థనైనా ఉపేక్షించేది లేదని కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. బాధ్యతాయుతమైన కంటెంట్ అందించడమే డిజిటల్ వేదికల ప్రాథమిక ధర్మమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపితమైంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




