Plastic VS Iron: ప్లాస్టిక్ లేదా ఇనుము ఏ కూలర్ వేసవిలో ఎక్కువ చల్లదనం అందిస్తుంది?

Plastic vs Iron Cooler Which One Gives Better Cooling in Summer
x

Plastic VS Iron: ప్లాస్టిక్ లేదా ఇనుము ఏ కూలర్ వేసవిలో ఎక్కువ చల్లదనం అందిస్తుంది?

Highlights

Plastic VS Iron Cooler: వేసవి వేడి వల్ల కూలర్లు, ఏసీల వినియోగం భారీగా పెరిగింది. ఫ్యాన్, కూలర్‌, ఏసీలు లేనిది ఒక్క నిమిషం కూడా గడవడం లేదు. అయితే ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టి ఏసీ కొనుగోలు చేయలేని వాళ్లు కూలర్లు వాడుతారు.

Plastic VS Iron Cooler: ఎక్కువ డబ్బు పెట్టి ఏసీలు కొనుగోలు చేయలేని లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూలర్లు ఎక్కువగా వినియోగిస్తారు. ఏసీలు, కూలర్లు లేనిదే నిమిషం కూడా గడవడం లేదు. ఈ నేపథ్యంలో కూలర్లు కొనుగోలు చేసే వాళ్ళు ఐరన్ లేదా ప్లాస్టిక్ రెండిటిలో ఏది ఎక్కువ చల్లదనాన్ని అందిస్తుందో తెలుసుకుందాం ..

ప్రస్తుతం ఎండ వేడిమి విజృంభిస్తుంది. ఏసీలు కొనుగోలు చేయాలని వాళ్ళు కూలర్లు ఎక్కువగా వినియోగిస్తారు. అయితే బడ్జెట్‌లో అందుబాటులో ఉండే ఈ కూలర్లలో రెండు రకాలు ఉంటాయి. ప్లాస్టిక్ లేదా ఐరన్ రెండిటిలో ఏది ఎక్కువగా లైఫ్ ఇస్తుంది. అంతేకాదు చల్లదనాన్ని అందిస్తుంది? అని చాలామందిలో సందిగ్ధం ఉంటుంది.

సాధారణంగా ప్లాస్టిక్ కూలర్లు కొనుగోలు చేస్తే చల్లని గాలి అందిస్తాయి. ఇవి ప్రస్తుతం రకరకాల మోడల్స్ అందుబాటులో ఉంటాయి. ఎప్పటి నుంచో ఈ ప్లాస్టిక్ కూలర్లు వినియోగంలో ఉన్నాయి. వాటిని సులభంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కూడా తీసుకు వెళతారు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది ప్లాస్టిక్ కూలర్లను ఉపయోగిస్తారు. మంచి డిజైన్‌తో పాటు అతి తక్కువ బరువుగా ఉంటుంది. దీనికి రస్ట్‌ కూడా పట్టదు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది ప్లాస్టిక్ కూలర్లు వినియోగించడానికి ఆసక్తి చూపుతారు.

ఇక ఐరన్ కూలర్లు ఉపయోగించేవారు కూడా ఉన్నారు. అయితే కొంతమంది ఐరన్ కూలర్ లో చల్లదనం ఎక్కువగా వస్తుంది అనుకుంటారు. అయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది ఐరన్ కూలర్లను కొనుగోలు చేస్తారు. సాధారణంగా ప్లాస్టిక్ కూలర్ కంటే ఇందులో ఎక్కువ చల్లదనం అందిస్తుంది అని చెబుతుంటారు. అయితే నిజానికి ఐరన్ కూలర్లు త్వరగానే రస్ట్ పడతాయి. అంతేకాదు ఇది ఎక్కువ బరువు కూడా కలిగి ఉంటుంది. విద్యుత్ వినియోగం కూడా ఎక్కువే.

Show Full Article
Print Article
Next Story
More Stories