Poco M8 5G: పోకో M8 లాంచ్.. 5220mAh బ్యాటరీ,108MP కెమెరా.. ధర ఎంతంటే..?

Poco M8 5G
x

Poco M8 5G: పోకో M8 లాంచ్.. 5220mAh బ్యాటరీ,108MP కెమెరా.. ధర ఎంతంటే..?

Highlights

Poco M8 5G: పోకో కంపెనీ ఇండియాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో M8 5Gని అధికారికంగా లాంచ్ చేసింది.

Poco M8 5G: పోకో కంపెనీ ఇండియాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో M8 5Gని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ 5G మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వచ్చింది. కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, బలమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో ప్రీమియం ఫీచర్లను సరసమైన ధరలో అందిస్తోంది. పోకో ఎం8 5జీ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. టాప్ మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.24,999.

పోకో కంపెనీ ఫోన్ లాంచ్ సందర్భంగా కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. మొదటి 12 గంటల్లో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఆఫర్లతో ఫోన్ ధర చాలా తక్కువ అవుతుంది. పోకో M8 5G సేల్ జనవరి 13 నుంచి ఇండియాలో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు అందమైన కలర్లలో వస్తుంది: కార్బన్ బ్లాక్, గ్లేషియల్ బ్లూ మరియు ఫ్రాస్ట్ సిల్వర్.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

పోకో M8 5Gలో 6.77 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 3డీ కర్వ్డ్ ప్యానల్‌తో ప్రీమియం లుక్ ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్, పగలు ఎండలో కూడా కనిపించేలా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఫోన్ మందం కేవలం 7.35mm మాత్రమే. ఈ ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ పవర్ చేస్తుంది. ఇది 4nmఎం టెక్నాలజీతో తయారైంది. 8జీబీ వరకు ర్యామ్‌తో మల్టీటాస్కింగ్ సులభం. 256GB వరకు స్టోరేజ్, మైక్రోఎస్‌డీ కార్డుతో 1TB వరకు పెంచవచ్చు.

పోకో M8 5G ఆండ్రాయిడ్ 15తో హైపర్‌ఓఎస్ 2 ఇంటర్‌ఫేస్‌లో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో మంచి సౌండ్. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు హామీ ఇచ్చింది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో రోజువారీ ఫోటోలు బాగుంటాయి. 2MP సెకండరీ సెన్సార్ డెప్త్ కోసం. ఫ్రంట్‌లో 20MP సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్

పెద్ద 5,520mAh బ్యాటరీ ఉంది. ఒక్క చార్జ్‌తో పూర్తి రోజు సులభంగా నడుస్తుంది. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్, 18వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్‌లో చార్జర్ ఇస్తున్నారు. ఐపీ65, ఐపీ66 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి రక్షణ ఉంది. ఫోన్ బరువు కేవలం 178 గ్రాములు మాత్రమే. పోకో M8 5G సరసమైన ధరలో బలమైన ఫీచర్లు అందిస్తోంది. ప్రీమియం డిస్‌ప్లే, మంచి పెర్ఫామెన్స్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు ఆకర్షణీయం. లాంచ్ ఆఫర్లు మరింత ఈ ఫోన్ బడ్జెట్ కొనుగోలు దారులకు మరింత చేరువ చేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories