Realme 16 Pro series: భారత్‌లో రియల్‌మీ 16 ప్రో.. దుమ్మురేపే ఫీచర్లు.. జనవరి 6 లాంచ్..!

Realme 16 Pro series
x

Realme 16 Pro series: భారత్‌లో రియల్‌మీ 16 ప్రో.. దుమ్మురేపే ఫీచర్లు.. జనవరి 6 లాంచ్..!

Highlights

Realme 16 Pro series: ప్రముఖ టెక్ సంస్థ రియల్‌మీ నుంచి త్వరలో భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Realme 16 Pro విడుదల కానుంది.

Realme 16 Pro series: ప్రముఖ టెక్ సంస్థ రియల్‌మీ నుంచి త్వరలో భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Realme 16 Pro విడుదల కానుంది. ఈ ఫోన్‌ను జనవరి 6, 2026న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కెమెరా, పనితీరు, బ్యాటరీ, డిస్‌ప్లే.. ఇలాప్రతి విభాగంలోనూ గణనీయమైన మెరుగుదలతో ఈ మోడల్‌ను రూపొందించినట్లు రియల్‌మీ తెలిపింది.

Realme 16 Proలో శాంసంగ్ HP5 ఫ్లాగ్‌షిప్ సెన్సార్ ఆధారిత 200 మెగాపిక్సెల్ లూమాకలర్ ప్రైమరీ కెమెరా ఇవ్వనున్నారు. సూపర్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో పాటు 1x, 2x, 4x లాస్‌లెస్ జూమ్ సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది. ఈ కెమెరా వ్యవస్థ TUV రైన్‌ల్యాండ్ ధృవీకరణను కూడా పొందింది. పోర్ట్‌రైట్ ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి ‘ఫైవ్ గోల్డెన్ ఫోకల్ లెంగ్త్’ కిట్‌ను కూడా అందిస్తున్నారు. దీనిలో 1x నుంచి 4x వరకు విభిన్న ఫోకల్ ఆప్షన్లు ఉంటాయి. అలాగే 21 రకాల పోర్ట్‌రైట్ టోన్లతో వచ్చే వైబ్ మాస్టర్ మోడ్, హెయిర్‌స్టైల్‌, బ్యాక్‌గ్రౌండ్ మార్పులకు ఉపయోగపడే AI Edit Gene వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక వీడియో విషయానికి వస్తే.. 4కే హెచ్‌డీఆర్ రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. పనితీరును సూచించే Antutu score 9.7 లక్షలకు పైగా ఉందని కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు గేమింగ్‌, హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఎయిర్ ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారని కంపెనీ తెలిపింది.

ఈ Realme 16 Proలో 7,000mah టైటాన్ బ్యాటరీ ఉంది. దీనిలో ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ డిజైన్‌ను స్లిమ్‌గా ఉంచినట్లు రియల్‌మీ చెబుతోంది. ఏఐ ఆధారిత లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్‌, సూపర్ పవర్ సేవింగ్ మోడ్ వంటి ఫీచర్లు బ్యాటరీ వినియోగాన్ని మరింత సమర్థంగా మారుస్తాయి. ఇకపోతే ఈ ఫోన్‌లో 1.5k రిజల్యూషన్ కలిగిన AMOLED displayను ఇచ్చారు. 144 Hertz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ రంగులు, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ అనుభవం మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.

ఇక డిజైన్ పరంగా ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నాఓటో ఫుకసావాతో కలిసి రూపొందించిన అర్బన్ వైల్డ్ డిజైన్ కాన్సెప్ట్‌ను దీనిలో ఉపయోగించారు. మాస్టర్ గోల్డ్, పెబుల్ గ్రే, ఆర్చిడ్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అదనంగా ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

రియల్‌మీ 16 ప్రో.. ఫ్లక్స్ ఇంజిన్‌తో కూడిన Realme యూజర్ ఇంటర్‌ఫేస్ 7.0పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో నెక్ట్స్ జనరేషన్ ఏఐ ఫీచర్లు, ఏఐ ఫ్రేమింగ్ మాస్టర్, ఏఐ రికార్డింగ్, గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌కు సంబంధించిన ధరలు, RAM, స్టోరేజ్ వేరియంట్ల వివరాలను జనవరి 6న జరిగే లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనున్నారు. Realme 16 Pro విడుదల తర్వాత దీనిని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories