
Realme C83 5G : రియల్‌మీ నుంచి అదిరిపోయే ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!
Realme C83 5G: తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని రియల్‌మీ ఈ C-సిరీస్ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది.
Realme C83 5G: తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని రియల్‌మీ ఈ C-సిరీస్ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఈ ఫోన్ మార్చి 7న అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. ఇది రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ సామర్థ్యం వల్ల ఫోన్‌ను దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
అలాగే ఫోన్ మన్నిక విషయంలో కూడా రియల్‌మీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తుంది. షాక్‌ప్రూఫ్ కోసం ఇందులో MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ టెక్నాలజీని వాడారని కంపెనీ తెలిపింది. అంటే ఫోన్ కింద పడినా త్వరగా దెబ్బతినదు. దీంతో పాటు వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. డిస్‌ప్లే, కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 6.8 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్‌ను ఇస్తున్నారు. ఫోన్ బ్యాక్ సైడ్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన 'బ్లూమింగ్ పర్పుల్' కల్లర్‌లో కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. మార్చి 7న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ Flipkart, Realme.com వెబ్‌సైట్లతో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రాసెసర్, ర్యామ్ (RAM) వంటి పూర్తి వివరాలు లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఫోన్ కావాలనుకునే వారికి Realme C83 5G ఒక మంచి ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




