
Realme P4 Lite: రియల్‌మే పి4 లైట్ ధర, ఫీచర్లు, ఆఫర్ల పూర్తి వివరాలు ఇవే!
Realme P4 Lite: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం రియల్‌మే ఒక అద్భుతమైన ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది.
Realme P4 Lite: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం రియల్‌మే ఒక అద్భుతమైన ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. అదే రియల్‌మే పి4 లైట్. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక సరైన ఎంపికగా నిలవనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ అసలు ధర సుమారు రూ.9,999 ఉండగా, లాంచ్ ఆఫర్లలో భాగంగా భారీ డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు కలిపి మొత్తంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుందని తెలిపింది. అన్ని ఆఫర్లు పోను ఈ ఫోన్ కేవలం రూ.7,999 కే సొంతం చేసుకోవచ్చని చెప్పింది.
ఫిబ్రవరి 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మే అధికారిక వెబ్‌సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఫోన్ ధర తక్కువైనప్పటికీ, ఫీచర్ల విషయంలో రియల్‌మే ఎక్కడా తగ్గలేదు. ఇందులో 6300 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిశ్చింతగా వాడుకోవచ్చు. దీనికి సపోర్ట్‌గా 15W ఛార్జర్ ఇస్తున్నారు. 6.74 అంగుళాల HD+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల వీడియోలు చూడటం, స్క్రోలింగ్ చేయడం చాలా స్మూత్‌గా ఉంటుంది. 4GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా అమర్చారు. బీచ్ గోల్డ్, బ్లాక్, సీ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కల్లర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డస్ట్, వాటర్ నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




