Realme P4 Power: రియల్‌మీ నుంచి కొత్త ఫోన్.. పవర్‌కు తిరుగులేదు.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!

Realme P4 Power: రియల్‌మీ నుంచి కొత్త ఫోన్.. పవర్‌కు తిరుగులేదు.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!
x

Realme P4 Power: రియల్‌మీ నుంచి కొత్త ఫోన్.. పవర్‌కు తిరుగులేదు.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!

Highlights

Realme P4 Power: ప్రముఖ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న రియల్‌మీ..

Realme P4 Power: ప్రముఖ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న రియల్‌మీ.. ఇప్పుడు మరో పవర్‌ఫుల్ మొబైల్‌ Realme P4 Powerను త్వరలోనే భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. ముఖ్యంగా భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. జనవరి 29న ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్ పేరులోనే పవర్ ఉంది. దానికి తగ్గట్టే దీనిలో ఏకంగా 10,000mAh బ్యాటరీని అమర్చడం విశేషం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh బ్యాటరీని చూస్తుంటాం. కానీ దానికి రెట్టింపు సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ బరువు కేవలం 218-219 గ్రాముల్లోపే ఉండటం గమనార్హం. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో, ఇంత పెద్ద బ్యాటరీని కూడా త్వరగానే ఛార్జ్ చేసుకోవచ్చు.

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఈ Realme P4 Power.. 6.78 అంగుళాల 1.5K క్వాడ్ కర్డ్వ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు చాలా స్మూత్ అనుభూతిని ఇస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను వాడారు. దీనికి తోడు హైపర్‌విజన్, AI చిప్‌ను కూడా జోడించారు. ఇది ఫోన్ వేగాన్ని, కెమెరా పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

Realme P4 Power ఫోన్ వెనుక భాగంలో 3 కెమెరాల సెటప్ ఉంటుంది. అలాగే OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP సెన్సార్ ఉండవచ్చని అంచనా. సెల్ఫీల కోసం ముందు వైపు 16MP కెమెరాను అందించారు. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0తో రానుంది. దీనికి మూడేళ్ల పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో రానున్న ఈ ఫోన్.. భారత మార్కెట్లో సుమారు రూ.25వేల నుంచి రూ. 30వేల మధ్య ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories