Jobs: ఏఐ వల్ల పోతున్న ఉద్యోగాలు ఇవే..! హెచ్చరించిన చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్

Jobs: ఏఐ వల్ల పోతున్న ఉద్యోగాలు ఇవే..! హెచ్చరించిన చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్
x

Jobs: ఏఐ వల్ల పోతున్న ఉద్యోగాలు ఇవే..! హెచ్చరించిన చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్

Highlights

Jobs: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) ప్రభావం వేగంగా పెరుగుతోంది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎలాన్ మస్క్ గ్రోక్ లాంటి ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత, అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Jobs: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) ప్రభావం వేగంగా పెరుగుతోంది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎలాన్ మస్క్ గ్రోక్ లాంటి ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత, అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ, ఏఐ వల్ల వచ్చే మార్పుల నేపథ్యంలో 12 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుడు, చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితన్నాయి.

ముందుగా కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలే పోతాయి

అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సదస్సులో పాల్గొన్న ఆల్ట్‌మన్, ఏఐ వల్ల తొలిసారిగా ప్రభావితమయ్యే ఉద్యోగాల జాబితాలో కస్టమర్ సపోర్ట్ టాపులో ఉంటుందన్నారు.

“ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐ ఆధారిత కాల్ సెంటర్లను వినియోగిస్తున్నాయి. ఇవి పూర్తిగా మానవులతో సమానంగా పని చేయగలవు. మరింత వేగంగా, తప్పుల్లేకుండా స్పందిస్తాయి. కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ చేసే పనులు ఇవి నిమిషాల్లో పూర్తిచేస్తాయి,” అని తెలిపారు.

వైద్యరంగంపై కూడా ఏఐ ప్రభావం

వైద్య రంగంలో కూడా ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడల్స్‌.. చాలా సందర్భాల్లో మానవ వైద్యుల కంటే మెరుగైన రోగ నిర్ధారణ చేయగలవని అభిప్రాయపడ్డారు. అయితే, పూర్తిగా ఏఐపైనే ఆధారపడటం సరైంది కాదని, మానవ వైద్యుల సహకారం అవసరమని స్పష్టం చేశారు.

ఎన్నికల వేళ ట్రంప్ ప్రభుత్వం చర్యలు

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏఐ అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డేటా సెంటర్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు వేగవంతం చేసినట్టు సమాచారం. ఇది గత ప్రభుత్వం (జో బైడెన్)తో పోలిస్తే భిన్నమైన దిశలో సాగుతోందని విశ్లేషకుల అభిప్రాయం.

భవిష్యత్ ఉద్యోగాలకు సవాల్

సామ్ ఆల్ట్‌మన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏఐ భవిష్యత్‌పై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్ సర్వీస్, డాక్టర్ల సహాయక ఉద్యోగాలు మొదలుకొని, అనేక మానవీయ విభాగాల్లో ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories