Samsung Galaxy S25 Offers: లిమిటెడ్ ఆఫర్.. సామ్‌సంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్‌పై రూ.11 వేల డిస్కౌంట్..!

Samsung Galaxy S25 Offers
x

Samsung Galaxy S25 Offers: లిమిటెడ్ ఆఫర్.. సామ్‌సంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్‌పై రూ.11 వేల డిస్కౌంట్..!

Highlights

Samsung Galaxy S25 Offers: సామ్‌సంగ్ అధికారికంగా ప్రీమియం Samsung Galaxy S25 స్మార్ట్‌ఫోన్‌పై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను ప్రకటించింది.

Samsung Galaxy S25 Offers: సామ్‌సంగ్ అధికారికంగా ప్రీమియం Samsung Galaxy S25 స్మార్ట్‌ఫోన్‌పై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరిలో లాంచ్ అయింది. ప్రారంభంలో దీని ధర రూ.74,999. ఈ స్మార్ట్‌ఫోన్ అనేక ఆసక్తికరమైన AI ఫీచర్లతో వచ్చింది. ఈ అద్భుతమైన ఫోన్ పై సామ్‌సంగ్ ప్రస్తుతం దాదాపు రూ.11,000 ధర తగ్గింపును అందిస్తోంది. మీరు గొప్ప కెమెరా, మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, ఈ Samsung Galaxy S25 స్మార్ట్‌ఫోన్ కొనడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

Samsung Galaxy S25 Limited Time Offer

సామ్‌సంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ రూ.11,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను అందిస్తోంది. 12GB/128GB వేరియంట్ ధర రూ.74,999 నుండి రూ.63,999కి తగ్గించారు. కస్టమర్లు తమ కొనుగోలుపై రూ. 10,000 ప్రత్యామ్నాయ బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందచ్చు.

Samsung Galaxy S25 Price Cut

ఈ ఆఫర్లు భారతదేశం అంతటా సామ్‌సంగ్ వెబ్‌సైట్,ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు రూ. 8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎమ్ఐ లేదా ఎఎన్‌బిఎఫ్‌సి ద్వారా 24 నెలల నో-కాస్ట్ EMIని కూడా ఎంచుకోవచ్చు.

Samsung Galaxy S25 Features

సామ్‌సంగ్ గెలాక్సీ S25 కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్ ఫోన్ ఐసీ బ్లూ, మింట్, కోరల్ రెడ్, పింక్ గోల్డ్ వంటి వివిధ రంగులలో వస్తుంది. దీనికి అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను 2340 x 1080 (FHD+),120 Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

ఈ గెలాక్సీ S25 సామ్‌సంగ్ One UIతో ఆండ్రాయిడ్‌లో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (f/1.8), 3x ఆప్టికల్ జూమ్‌తో 10మెగాపిక్సెల్ టెలిఫోటో, 12మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా అందించారు. ఇది 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్, 240fps వరకు స్లో-మోషన్ క్యాప్చర్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 4000mAh బ్యాటరీ ఉంది. కంపెనీ 29 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను హామీ ఇస్తుంది. ఇది USB-C ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్,రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories