Samsung Galaxy F17 5G: శాంసంగ్ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. త్వరలో లాంచ్.. హిట్ పక్కా..!

Samsung Galaxy F17 5G: శాంసంగ్ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. త్వరలో లాంచ్.. హిట్ పక్కా..!
x

Samsung Galaxy F17 5G: శాంసంగ్ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. త్వరలో లాంచ్.. హిట్ పక్కా..!

Highlights

ఈ నెల సెప్టెంబర్ 4న శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్‌ను నిర్వహించనుంది, దీనిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈని ప్రవేశపెట్టవచ్చు. ఇంతలో, కంపెనీ ఈ నెలలో దాని సరసమైన గెలాక్సీ F17 5జీ, గెలాక్సీ M17 5జీని కూడా విడుదల చేయచ్చని వార్తలు వస్తున్నాయి.

Samsung Galaxy F17 5G: ఈ నెల సెప్టెంబర్ 4న శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్‌ను నిర్వహించనుంది, దీనిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈని ప్రవేశపెట్టవచ్చు. ఇంతలో, కంపెనీ ఈ నెలలో దాని సరసమైన గెలాక్సీ F17 5జీ, గెలాక్సీ M17 5జీని కూడా విడుదల చేయచ్చని వార్తలు వస్తున్నాయి. వాటి లాంచ్ తేదీ ఇంకా వెల్లడించనప్పటికీ, కొన్ని నివేదికలలో దాని స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ F17 5జీలో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ ఉంటుంది. అలానే ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌‌ను కూడా చూడచ్చు. దీని మెయిన్ కెమెరా 50-మెగాపిక్సెల్‌లు కావచ్చు. అదే సమయంలో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను పొందచ్చు. ఫోన్‌లో ఇంకా ఎటువంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం.


Samsung Galaxy F17 5G Price

శాంసంగ్ గెలాక్సీ F17 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 15,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందగలదని ఒక నివేదిక పేర్కొంది. ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,000 కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Samsung Galaxy F17 5G Specifications

కొన్ని నివేదికలు గెలాక్సీ F17 5జీలో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ ఉంటుందని సూచిస్తున్నాయి. అలాగే, ఫోన్‌కి గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ అందించారు. ఫోన్‌ 6ఎన్ఎమ్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారంగా వన్ యూఐ 7ని పొందచ్చు. కంపెనీ ఈ ఫోన్‌కు ఆరు సంవత్సరాల పాటు ఓఎస్, సేఫ్టీ అప్‌డేట్లను అందించగలదు.

శాంసంగ్ గెలాక్సీ F17 5జీ కెమెరా స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే, హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం ఫోన్ ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనితో పాటు ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండచ్చు, ఇది 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories