Samsung Galaxy F56 Launch: సామ్‌సంగ్ ఫోన్ల హవా.. గెలాక్సీ F56 లాంచ్.. ఫీచర్లు అదరహో.. అవేంటో తెలుసుకోవాల్సిందే..!

Samsung Galaxy F56 Launch: సామ్‌సంగ్ ఫోన్ల హవా.. గెలాక్సీ F56 లాంచ్.. ఫీచర్లు అదరహో.. అవేంటో తెలుసుకోవాల్సిందే..!
x

Samsung Galaxy F56 Launch: సామ్‌సంగ్ ఫోన్ల హవా.. గెలాక్సీ F56 లాంచ్.. ఫీచర్లు అదరహో.. అవేంటో తెలుసుకోవాల్సిందే..!

Highlights

Samsung Galaxy F56 Launch: సామ్‌సంగ్ తన F-సిరీస్‌లో అత్యంత సన్నని ఫోన్ గెలాక్సీ F56 ను భారతదేశంలో విడుదల చేసింది.

Samsung Galaxy F56 Launch: సామ్‌సంగ్ తన F-సిరీస్‌లో అత్యంత సన్నని ఫోన్ గెలాక్సీ F56 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సామ్‌సంగ్ ఫోన్ మందం 7.2మి.మీ మాత్రమే. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్+ డిస్‌ప్లే ఉంది. దీనితో పాటు, ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో 50మెగాపిక్సెల్ కెమెరా, ఎక్సినోస్ 1480 చిప్‌సెట్ ఉన్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 56 స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Samsung Galaxy F56 Price And Offers

దేశంలో సామ్‌సంగ్ గెలాక్సీ F56 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ.25,999. రెండవ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో రూ. 28,999 ధరకు ప్రవేశపెట్టారు. లాంచ్ ఆఫర్‌గా, కంపెనీ రూ. 2,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ కూడా ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఫైనాన్స్ ప్లస్, కంపెనీ భాగస్వామి NBFCతో రూ.1556 EMIకి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F56 Specifications

సామ్‌సంగ్ గెలాక్సీ F56 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల Full-HD+ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేతో విడుదలైంది. దీని పీక్ బ్రైట్నెస్ 1200 నిట్స్ ,రిఫ్రెష్ రేటు 120Hz. ఈ ఫోన్ ముందు, వెనుక ప్యానెల్‌లో కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణను అందించింది. ఈ ఫీచర్ చాలా మన్నికగా చేస్తుందని సామ్‌సంగ్ చెబుతోంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ గ్రీన్, వైలెట్ కలర్స్‌లో వస్తుంది.

సామ్‌సంగ్ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ OIS ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ తక్కువ కాంతిలో కూడా శక్తివంతమైన ఫోటోగ్రఫీ, 4K వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో 12మెగాపిక్సెల్ HDR ఫ్రంట్ కెమెరా ఉంది. దీనితో పాటు, ఈ ఫోన్ AI-ఆధారిత ఎడిటింగ్ టూల్స్‌తో వస్తుంది - ఆబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్ సూచనలు ఇస్తుంది. మిడ్-రేంజ్‌లో లాంచ్ అయిన ఈ సామ్‌సంగ్ ఫోన్, ఎక్సినోస్ 1480 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో మార్కెట్లో లాంచ్ అయింది. అలానే గెలాక్సీ F56 5G మొబైల్‌ 5000mAh బ్యాటరీ,45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ One UI 7 పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు ఆరు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్, సేఫ్టీ అప్టేట్లు అందుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories