Samsung Galaxy F70e 5G: సామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G.. బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లతో అదిరిపోయే ఎంట్రీ..!

Samsung Galaxy F70e 5G: సామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G.. బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లతో అదిరిపోయే ఎంట్రీ..!
x
Highlights

Samsung Galaxy F70e 5G: భారతీయ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన పట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు సామ్‌సంగ్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది.

Samsung Galaxy F70e 5G: భారతీయ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన పట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు సామ్‌సంగ్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఫిబ్రవరి 9, 2026న గెలాక్సీ F70 సిరీస్‌లో భాగంగా మొట్టమొదటి మోడల్ 'గెలాక్సీ F70e 5G'ని కంపెనీ లాంచ్ చేసింది. ముఖ్యంగా నేటి తరం యువత, నిరంతరం కష్టపడే హస్ట్లర్లు, పెద్ద కలలు కనే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచుల భారీ LCD HD+ డిస్‌ప్లేతో వస్తోంది, దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. 800 nits బ్రైట్‌నెస్ కారణంగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. డిజైన్ పరంగా సామ్‌సంగ్ ఇందులో వెగాన్ లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‌ను వాడి ఫోన్‌కు ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. ఫోన్ సైడ్ భాగంలో 'కీ ఐలాండ్' డిజైన్‌తో కూడిన పవర్, వాల్యూమ్ బటన్లు ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా, దీనికి ఉన్న IP54 రేటింగ్ దుమ్ము, నీటి చినుకుల నుండి ఫోన్‌కు రక్షణ కల్పిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ F70e 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అమర్చారు, ఇది 5G కనెక్టివిటీతో పాటు రోజువారీ పనులను వేగంగా పూర్తి చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. సామ్‌సంగ్ ఈ ఫోన్ కోసం ఏకంగా 6 మేజర్ OS అప్‌డేట్లను ప్రకటిండం విశేషం, అంటే భవిష్యత్తులో వచ్చే కొత్త వెర్షన్లను కూడా ఈ ఫోన్‌లో సులభంగా వాడుకోవచ్చు. నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు యూజర్ డేటాకు పటిష్టమైన భద్రతను కల్పిస్తాయి.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉన్నాయి, ఇవి వైబ్రెంట్, క్లియర్ ఫోటోలను అందిస్తాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను కేటాయించారు. ఈ ఫోన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 6000mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సామాన్య వినియోగదారులకు రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల బ్యాటరీ త్వరగానే రీఛార్జ్ అవుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 128GB ఇంటర్నల్ మెమరీతో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం కూడా ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధర కేవలం రూ. 12,999 కాగా, 6GB RAM, 128GB వేరియంట్ ధర రూ. 14,999గా నిర్ణయించారు. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, లాంగ్-టర్మ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్, భారీ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 5G నెట్‌వర్క్ వేగంతో పాటు స్టైలిష్ డిజైన్‌ను కోరుకునే కుర్రాళ్లకు ఈ ఫోన్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories