Samsung Galaxy S25 FE: గెలాక్సీ S25 FE.. ఇండియాకి వచ్చేసింది.. ప్రైస్ ఎంతంటే..?

Samsung Galaxy S25 FE: గెలాక్సీ S25 FE.. ఇండియాకి వచ్చేసింది.. ప్రైస్ ఎంతంటే..?
x

Samsung Galaxy S25 FE: గెలాక్సీ S25 FE.. ఇండియాకి వచ్చేసింది.. ప్రైస్ ఎంతంటే..?

Highlights

టెక్ దిగ్గజం శాంసంగ్ ఇప్పుడు భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ S25 FE (ఫ్యాన్ ఎడిషన్) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.! గెలాక్సీ S25 FE ఫోన్‌ను గత వారం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.

Samsung Galaxy S25 FE: టెక్ దిగ్గజం శాంసంగ్ ఇప్పుడు భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ S25 FE (ఫ్యాన్ ఎడిషన్) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.! గెలాక్సీ S25 FE ఫోన్‌ను గత వారం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ ధర గురించి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సమాచారం అందించింది, కానీ ఇప్పుడు భారతదేశంలో గెలాక్సీ S25 FE ధర వెల్లడైంది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేక ధరలు, ఆకర్షణీయమైన ఆఫర్‌లతో గెలాక్సీ S25 FE ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారాన్ని చూద్దాం!

కొత్త గెలాక్సీ S25 FE ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తోెంది. దీని డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్+ ద్వారా ప్రొటక్ట్‌గా ఉంటుంది. పనితీరు కోసం, గెలాక్సీ S25 FE 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు జత చేసిన Exynos 2400 ప్రాసెసర్‌ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8 ఆధారంగా వన్ UI 16 పై నడుస్తుంది. 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్, భద్రతా నవీకరణలను అందుకుంటుంది.

గెలాక్సీ S25 FE ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ జనరేటివ్ ఎడిట్‌తో సహా AI- ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది.

బ్యాటరీ విభాగంలో, ఫోన్ 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,900mAh బ్యాటరీ ఉంది. ఫోన్ దాని మన్నికను పెంచడానికి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్,IP68 దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంది. దీని సన్నని డిజైన్ (7.4mm), 190 గ్రాముల బరువు దీనిని తేలికగా, ఉపయోగించడానికి సులభతరం చేస్తుంది.

Samsung Galaxy S25 FE Price

8GB + 128GB: రూ.59,999

8GB + 256GB: రూ.65,999

8GB + 512GB: రూ.77,999

శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్లు సెప్టెంబర్ 29 నుండి శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, ప్రత్యేకమైన శాంసంగ్ స్టోర్‌లు, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లు, ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ఐస్ బ్లూ, జెట్ బ్లాక్, నేవీ, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌గా, 256GB మోడల్ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఉచిత 512GB అప్‌గ్రేడ్ లభిస్తుంది. అదనంగా,రూ.5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉందని శాంసంగ్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories