Samsung Galaxy S26 Plus: మార్కెట్‌ను షేక్ చేయనున్న శామ్‌సంగ్.. గెలాక్సీ ఎస్26 ప్లస్ వచ్చేస్తోంది..!

Samsung Galaxy S26 Plus: మార్కెట్‌ను షేక్ చేయనున్న శామ్‌సంగ్.. గెలాక్సీ ఎస్26 ప్లస్ వచ్చేస్తోంది..!
x

Samsung Galaxy S26 Plus: మార్కెట్‌ను షేక్ చేయనున్న శామ్‌సంగ్.. గెలాక్సీ ఎస్26 ప్లస్ వచ్చేస్తోంది..!

Highlights

కొత్త సంవత్సరం 2026కి అడుగులు వేస్తున్న ఈ సమయంలో, స్మార్ట్‌ఫోన్ ప్రపంచం మరోసారి హీట్ పెంచుతోంది.

Samsung Galaxy S26 Plus: కొత్త సంవత్సరం 2026కి అడుగులు వేస్తున్న ఈ సమయంలో, స్మార్ట్‌ఫోన్ ప్రపంచం మరోసారి హీట్ పెంచుతోంది. ముఖ్యంగా శామ్‌సంగ్ నుంచి వచ్చే ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్పై లీకులు, రూమర్లు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ సిరీస్‌లో మూడు మోడళ్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అవి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్, అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా (Samsung Galaxy S26, Samsung Galaxy S26 Plus, Samsung Galaxy S26 Ultra). ఈ మూడింటిలో బేస్ వేరియంట్‌కి అల్ట్రా వేరియంట్‌కి మధ్యలో నిలిచే ఫోన్‌గా గెలాక్సీ ఎస్ 26 ప్లస్‌పై వినియోగదారుల్లో ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. అల్ట్రా లెవల్ ధర కాకుండా, ఫ్లాగ్‌షిప్ అనుభవం కావాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ చాయిస్‌గా మారే అవకాశం ఉంది. లీకులు, రూమర్ల ఆధారంగా ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ డిజైన్‌లో మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. అయితే గత మోడల్‌తో పోలిస్తే కొంచెం స్లిమ్ ఛాసిస్‌తో ఈ ఫోన్ రావచ్చని లీకులు చెబుతున్నాయి. చేతిలో పట్టుకున్నప్పుడు మరింత ప్రీమియం ఫీల్ ఇచ్చేలా ఫ్రేమ్ డిజైన్ ఉంటుందని టాక్. కెమెరా మాడ్యూల్ లేఅవుట్‌లో కూడా శామ్‌సంగ్ తన సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే, ఇది రాడికల్ మార్పుల కంటే రిఫైన్ చేసిన అప్‌డేటెడ్ లుక్‌తో వచ్చే ఫోన్‌లా కనిపిస్తోంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే, గెలాక్సీ ఎస్ 26 ప్లస్‌లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. దీనికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇవ్వవచ్చని సమాచారం. శామ్‌సంగ్ అమోలెడ్ ప్యానెల్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి, కలర్ రిప్రొడక్షన్, బ్రైట్‌నెస్, వ్యూయింగ్ యాంగిల్స్ విషయంలో ఈ ఫోన్ కూడా ఫ్లాగ్‌షిప్ స్థాయిలో అనుభవం ఇవ్వొచ్చని అంచనా. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, రోజువారీ స్క్రోలింగ్ అన్నింటిలోనూ ఇది స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

గెలాక్సీ ఎస్ 26 ప్లస్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి తోడు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, మరో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇవ్వవచ్చని సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశముంది. శామ్‌సంగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ బలంగా ఉండటంతో, నంబర్లు పెద్దగా మారకపోయినా ఫోటో క్వాలిటీ విషయంలో స్పష్టమైన మార్పు కనిపించవచ్చని అంచనా. డే ఫోటోగ్రఫీతో పాటు నైట్ ఫోటోగ్రఫీలో కూడా ఇది మంచి రిజల్ట్స్ ఇవ్వొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎస్ 26 ప్లస్‌లో క్వాల్‌కామ్ నుంచి వచ్చే లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ఇది హైఎండ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ కావడంతో, మల్టీటాస్కింగ్, గేమింగ్, హై రెజల్యూషన్ వీడియో ఎడిటింగ్ లాంటి పనుల్లో ఎలాంటి ల్యాగ్ లేకుండా పని చేసే అవకాశముంది. ర్యామ్ విషయంలో 12 జీబీ ర్యామ్ ఇవ్వవచ్చని సమాచారం. స్టోరేజ్‌గా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ సాధారణ యూజర్లకు మాత్రమే కాకుండా, హెవీ యూజర్లకు కూడా తగినంత అనుభవం ఇవ్వగలదని చెప్పొచ్చు.

బ్యాటరీ సెక్షన్‌లో గెలాక్సీ ఎస్ 26 ప్లస్ పెద్ద అప్‌గ్రేడ్ తీసుకురావచ్చని లీకులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌లో 5500mah బ్యాటరీ ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనికి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చని అంచనా. బ్యాటరీ కెపాసిటీ పెరగడం వల్ల ఒక ఫుల్ డే మాత్రమే కాదు, హెవీ యూజ్ ఉన్నా కూడా డే ఎండ్ వరకు బ్యాటరీ నిలబడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గెలాక్సీ ఎస్ 26 ప్లస్, మిగతా ఎస్ 26 సిరీస్ ఫోన్‌లతో పాటు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీకుల ప్రకారం ఇది జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిష్కరణ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే కొన్ని రూమర్లు మాత్రం లాంచ్ ఫిబ్రవరి 2026 చివర వరకు వాయిదా పడే అవకాశాన్ని కూడా సూచిస్తున్నాయి. ఇప్పటివరకు శామ్‌సంగ్ నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఈ తేదీలన్నీ అంచనాలుగా మాత్రమే చూడాలి.

ధర విషయానికి వస్తే, గెలాక్సీ ఎస్ 26 ప్లస్ ఇండియా మార్కెట్‌లో సుమారు రూ. 95,000 నుంచి రూ. 1,05,999 మధ్యలో లాంచ్ కావచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అల్ట్రా మోడల్ కంటే కొంచెం తక్కువ ధరలో, కానీ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ రావడం వల్ల, ప్రీమియం సెగ్మెంట్‌లో ఇది మంచి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు. ఇవి అన్నీ లీకులు, రూమర్ల ఆధారంగా వచ్చిన వివరాలే. శామ్‌సంగ్ అధికారికంగా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి, ఈ సమాచారాన్ని ఒక గ్రెయిన్ ఆఫ్ సాల్ట్‌తో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా కూడా, గెలాక్సీ ఎస్ 26 ప్లస్‌పై అంచనాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories