Cyber Crime: మిమ్మల్ని అరెస్ట్ చేశాం.. మీకు కూడా అలాంటి కాల్స్ వచ్చాయా? అప్పుడేం చేయాలంటే ?

Cyber Crime
x

Cyber Crime: మిమ్మల్ని అరెస్ట్ చేశాం.. మీకు కూడా అలాంటి కాల్స్ వచ్చాయా? అప్పుడేం చేయాలంటే ?

Highlights

Cyber Crime: మీకు ఎప్పుడైనా మీరు డిజిటల్ అరెస్ట్ చేయబడ్డారని కాల్స్ ఎప్పుడైనా వచ్చాయా..ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి.

Cyber Crime: మీకు ఎప్పుడైనా మీరు డిజిటల్ అరెస్ట్ చేయబడ్డారని కాల్స్ ఎప్పుడైనా వచ్చాయా..ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. ఈ కాల్ కూడా ఒక రకమైన స్కామ్ కాల్ లాంటిదే. దీని గురించి ఎస్ బీఐ ప్రజలను హెచ్చరించింది. అసలు విషయం ఏమిటో చూద్దాం. వేగంగా పెరుగుతున్న మోసం కేసుల మధ్య, అరెస్టులు , వారెంట్లతో కూడిన స్కామ్ కాల్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఒక మోసగాడు లేదా స్కామర్ మిమ్మల్ని బ్యాంకు అధికారిగా, సీబీఐ అధికారిగా లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారిగా నటిస్తూ ఫోన్ చేసి మోసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ స్కామర్లు వీడియో లేదా ఆడియో కాల్స్ చేస్తారు. ప్రొఫెషనల్ ఆఫీసర్లలా మాట్లాడతారు. వారి ఉచ్చులో పడినప్పుడు, వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఏదైనా మీరు వాళ్లను అర్థం చేసుకునే సమయానికి మీ ఖాతా ఖాళీ అయిపోతుంది.

ఇలాంటి మోసాలు జరుగుతుండడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన కస్టమర్లను హెచ్చరించింది. కొత్త మోసం మాడ్యూల్ గురించి బ్యాంక్ కస్టమర్లను అప్రమత్తం చేసింది. మోసగాళ్ళు సీబీఐ లేదా ఆదాయపు పన్ను అధికారులుగా నటిస్తూ కస్టమర్లను బెదిరించవచ్చని, నకిలీ చట్టపరమైన చర్యలతో వారిని బెదిరించవచ్చని SBI తెలిపింది. బ్యాంక్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన పోస్ట్‌ను కూడా షేర్ చేసింది.



వాళ్ళు మోసం ఎలా చేస్తారు?

మొదటగా మోసగాళ్ళు కస్టమర్లకు కాల్ చేస్తారు.. మాటల మధ్యలో వారికి అవసరమైన అన్ని వివరాలను సేకరిస్తారు. కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, స్కామర్లు తాము ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి, వారి నుండి కొంత వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారు. మోసగాళ్ళు ముఖ్యంగా కస్టమర్‌ను KYC నంబర్, చిరునామా, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వంటి వివరాలను అడుగుతారు.

దీనితో పాటు మోసగాళ్ళు కస్టమర్ కుటుంబం గురించి సమాచారాన్ని సేకరించి, వారి UPI సర్వీసు సరిగ్గా పనిచేయడం లేదని, వారు డబ్బు పంపుతున్నారని చెబుతూ వారి పేరుతో కాల్స్ చేస్తారు. వాస్తవానికి వారు కస్టమర్‌ను మోసం చేయడానికి పన్నులను ఎగవేస్తున్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మోసగాళ్ళు మీరు ఇటీవల పన్ను వర్తించే ఆస్తిని విక్రయించారని.. మీరు దానికి పన్ను చెల్లించలేదని కూడా క్లెయిమ్ చేయవచ్చు. ఈ సమాచారం వారికి ఆస్తి వెబ్‌సైట్, ఆస్తి బ్రోకర్ వెబ్‌సైట్ లేదా ఆస్తి రిజిస్ట్రార్ కార్యాలయం నుండి లీక్ అయి ఉండవచ్చు.

కస్టమర్లు వారి ఉచ్చులో చిక్కుకున్నప్పుడు, మోసగాళ్ళు వారికి లంచం ఇస్తే విషయం పరిష్కారమవుతుందని చెబుతారు. తర్వాత వారు కస్టమర్‌ను దర్యాప్తు జరిగే వరకు డబ్బును వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయమని అడుగుతారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే డబ్బు తిరిగి ట్రాన్స్ ఫర్ చేస్తామని చెబుతారు.

ఇలాంటి మోసాలను ఎలా నివారించాలి

* కాల్ చేస్తున్న లేదా మెసేజ్ చేస్తున్న వ్యక్తి పేరును ఎల్లప్పుడూ తెలుసుకోండి. తెలియని కాల్స్‌కు స్పందించకండి.

* ఏ బ్యాంకు, సీబీఐ లేదా ఆదాయపు పన్ను అధికారి మిమ్మల్ని ఫోన్, SMS లేదా వీడియో కాల్ ద్వారా రహస్య సమాచారం అడగరు.

* ఎవరైనా మిమ్మల్ని చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు విధిస్తానని బెదిరిస్తే, జాగ్రత్తగా ఉండండి.

* ఏవైనా అనుమానాస్పద కాల్‌లు లేదా మెసేజ్ మీ బ్యాంకు, స్థానిక అధికారులకు తెలియజేయాలి.

* తెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దు లేదా మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories