
Smartphone Bonanza: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు పండగే.. మార్చిలో లాంచ్ కాబోతున్న టాప్-5 ఫోన్లు ఇవే!
Smartphone Bonanza: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు పండగే.. మార్చిలో లాంచ్ కాబోతున్న టాప్-5 ఫోన్లు ఇవే!
మార్చి 2026లో మొబైల్ మార్కెట్ సందడి మామూలుగా లేదు. ఫిబ్రవరిలో Samsung Galaxy S26 సిరీస్, Pixel 10a వంటి భారీ లాంచ్‌ల తర్వాత, మార్చి నెల కూడా అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌కు రెడీ అవుతుంది. బడ్జెట్ ఫోన్ల నుంచి పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్స్ వరకు మార్చి నెలలో విడుదల కానున్న టాప్ ఫోన్ల ఫీచర్లు, ధరలు, తదితరల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. నథింగ్ ఫోన్ 4a సిరీస్ (Nothing Phone 4a Series)
నథింగ్ కంపెనీ తన '4a' సిరీస్‌ను మార్చి 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. దీని ధర విషయానికి వస్తే.. బేస్ మోడల్ సుమారు రూ.31,999, ప్రో మోడల్ రూ.39,999 ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఎప్పటిలాగే తన వైట్ ఫినిషింగ్‌తో పాటు, ఈసారి కొత్తగా పింక్ కలర్ ఆప్షన్‌ను కూడా కంపెనీ రిలీజ్ చేస్తోంది.
2. ఆపిల్ ఐఫోన్ 17ఇ (Apple iPhone 17e)
మార్చి 4న ఆపిల్ ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ఐఫోన్ 17eని పరిచయం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది పవర్‌ఫుల్ A19 చిప్‌తో రానుంది. డిజైన్ పరంగా ఐఫోన్ 16eని పోలి ఉన్నప్పటికీ, పెర్ఫార్మెన్స్ పరంగా ఐఫోన్ 17 స్థాయిలో ఉంటుందని సమాచారం. దీని ధర విషయానికి వస్తే.. ఇండియాలో దీని స్టార్టింగ్ ధర సుమారు రూ.59,900 ఉండవచ్చని అంచనా.
3. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion)
మోటరోలా నుంచి రానున్న ఈ ఫోన్ బ్యాటరీ, డిస్‌ప్లే పరంగా సంచలనం సృష్టించబోతోందని సమాచారం. దీని డిస్‌ప్లే విషయానికి వస్తే.. 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 1.5K కర్వ్డ్ డిస్‌ప్లేతో రాబోతుందని అంటున్నారు. బ్యాటరీ గురించి చూస్తే.. ఇది ఏకంగా 7000 mAh భారీ బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని చెబుతున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్‌తో వినియోగదారుల ముందుకు వస్తుందని సమాచారం.
4. పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ (Poco X8 Pro Series)
మార్చి మొదటి వారంలో Poco X8 Pro , X8 Pro Max మార్కెట్లోకి రావొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.59-అంగుళాల 1.5K OLED ప్యానెల్ ఉంటుందని సమాచారం. ఇది డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌తో పని చేస్తుందని అంటున్నారు. స్టోరేజ్ దగ్గరికి వస్తే.. వేగవంతమైన LPDDR5x RAM , UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని ఇందులో వాడుతున్నారని చెబుతున్నారు.
5. వన్‌ప్లస్ 15T (OnePlus 15T)
వన్‌ప్లస్ తన 'T' సిరీస్ ఫోన్‌ను మార్చిలో చైనాలో లాంచ్ చేయనుందని టాక్. ఇండియాలో ఇది OnePlus 15s పేరుతో జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు.
మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మరికొన్ని రోజులు ఆగడం మంచిదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే మార్చిలో వచ్చే ఈ కొత్త ఫోన్ల ఆప్షన్లు మీ నిర్ణయాన్ని మార్చవచ్చని అంటున్నాయి. ఏదేమైనా మార్చిలో రిలీజ్ కాబోతున్న సరికొత్త మాడల్స్ స్మార్ట్ ఫోన్ రంగంలో మరిన్ని సంచలనాలు సృష్టిస్తాయని అంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




