Smartphone Launches in September 2025: ఐఫోన్ 17తో పాటు Samsung Galaxy S25 FE, Lava Agni 4.. క్రేజీ గ్యాడ్జెట్స్ రెడీ!


Smartphone Launches in September 2025: Along with iPhone 17, Samsung Galaxy S25 FE, Lava Agni 4.. crazy gadgets are ready!
సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు Samsung Galaxy S25 FE, Lava Agni 4 లాంచ్ అవుతున్నాయి. కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, లాంచ్ తేదీలు, ధర వివరాలు తెలుసుకోండి.
సెప్టెంబర్ నెల స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు పండగ కానుంది. గూగుల్ ఇప్పటికే Pixel 10 Seriesను లాంచ్ చేస్తే, ఇప్పుడు Apple iPhone 17 Series, Samsung Galaxy S25 FE, Lava Agni 4 మార్కెట్లో అడుగుపెట్టబోతున్నాయి. ఈ లాంచ్‌లు టెక్ లవర్స్ కోసం అత్యంత ఆసక్తికరంగా మారాయి.
Apple iPhone 17 Series
ఈసారి సెప్టెంబర్‌లో ప్రధాన ఆకర్షణ iPhone 17 Series.
నాలుగు మోడల్స్ రావనున్నాయి:
- iPhone 17
- iPhone 17 Pro
- iPhone 17 Pro Max
- iPhone 17 Air
లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న అమెరికాలో జరగనున్నట్టు సమాచారం.
లీక్స్ ప్రకారం:
- Pro మోడల్స్‌లో డిజైన్ పెద్ద మార్పులు ఉండే అవకాశం.
- iPhone 17 Air కొత్త మోడల్‌గా రావచ్చు (గత ఏడాది Plus మోడల్‌ను రీప్లేస్ చేయవచ్చు).
- iPhone 17 బేసిక్ మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్ చేరవచ్చు.
- iPhone 17 Pro Maxలో ఇప్పటివరకు అతిపెద్ద 5,000 mAh బ్యాటరీ రానుంది (iPhone 16 Pro Maxలో 4,676 mAh).
Samsung Galaxy S25 FE
Samsung లవర్స్ కోసం రాబోతున్న మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్ Galaxy S25 FE.
- ధర: సుమారు ₹60,000
- Exynos 2400 Chipset
- Triple Camera Setup (50MP మెయిన్ + Ultra-wide + Telephoto)
- Battery: 4,900 mAh
- లాంచ్ డేట్: సెప్టెంబర్ 4 అని లీకులు చెబుతున్నాయి.
Lava Agni 4 – Made in India Smartphone
దేశీయ బ్రాండ్ Lava నుంచి రాబోయే మరో స్మార్ట్‌ఫోన్ Agni 4.
- గత సంవత్సరం వచ్చిన Agni 3 విజయం తర్వాత, ఈసారి Diwali సీజన్‌ను టార్గెట్ చేస్తోంది.
- MediaTek Dimensity 8350 Chipset ఉండవచ్చని అంచనాలు.
- లాంచ్ సెప్టెంబర్–అక్టోబర్ మధ్యలో జరిగే అవకాశముంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire