Solar Eclipse on August 2, 2027: 2027లో అరుదైన సూర్యగ్రహణం... 6 నిమిషాల 23 సెకండ్ల పాటు చీకటి!

Solar Eclipse on August 2, 2027
x

Solar Eclipse on August 2, 2027: 2027లో అరుదైన సూర్యగ్రహణం – 6 నిమిషాల 23 సెకండ్ల పాటు చీకటి!

Highlights

Solar Eclipse on August 2, 2027: మరో రెండేళ్లలో ప్రపంచం అరుదైన ఖగోళ దృశ్యానికి సాక్ష్యం ఇవ్వనుంది. 2027లో జరగనున్న సూర్యగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాల సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. “గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్” అనే పేరుతో ఇది గుర్తింపు పొందనుంది.

Solar Eclipse: మరో రెండేళ్లలో ప్రపంచం అరుదైన ఖగోళ దృశ్యానికి సాక్ష్యం ఇవ్వనుంది. 2027లో జరగనున్న సూర్యగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాల సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. “గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్” అనే పేరుతో ఇది గుర్తింపు పొందనుంది.

ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పివేసి 6 నిమిషాల 23 సెకన్లపాటు భూమిపై చీకటిని నెలకొల్పనుంది. ఇది ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రారంభమై, ఆ తర్వాత యూరప్‌, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం దిశగా ప్రయాణిస్తుంది.

ఇవి గ్రహణం కనిపించే ప్రధాన ప్రాంతాలు:

స్పెయిన్‌: కాడిజ్‌, మలాగా ప్రాంతాల్లో 4 నిమిషాలకు పైగా గ్రహణం

ఉత్తర మొరాకో: టాంజియర్‌, టెటౌవాన్

ఈజిప్ట్: లక్సర్‌ ప్రాంతంలో 6 నిమిషాలకు పైగా సంపూర్ణ గ్రహణం

మధ్యప్రాచ్యం: జెడ్డా, మక్కా, యెమెన్‌, సోమాలియాలోనూ ఈ దృశ్యం కనిపించనుంది

భారతదేశంలో మాత్రం కనిపించదు...

ఈ గ్రహణం భారతదేశం సహా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొంతవరకు అంచు భాగంలో మాత్రమే కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు.

శాస్త్రీయంగా విలువైన ఘట్టం!

ఈ సూర్యగ్రహణం అఫీలియన్ (భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉన్న స్థితి) సమయంలో జరుగుతుండగా, చంద్రుడు పెరిజీ (భూమికి అత్యంత సమీపంలో ఉన్న దశ)లో ఉంటుంది. దాంతో చంద్రుడు పెద్దగా కనిపించి సూర్యుని పూర్తిగా కప్పేస్తుంది. ఫలితంగా గ్రహణ కాల వ్యవధి గణనీయంగా పెరుగుతుంది.

ఎలా చూడాలి?

ఈ గ్రహణాన్ని సురక్షితంగా తిలకించాలంటే తప్పనిసరిగా ISO 12312-2 ప్రమాణాలున్న సోలార్ వ్యూయర్ గ్లాసెస్ను ఉపయోగించాలి. సాధారణ సన్‌గ్లాసెస్ వాడకూడదు. అలాగే, పిన్‌హోల్ ప్రొజెక్టర్ వంటి పద్ధతులు కూడా ఉపయోగపడతాయి.

ఈ సమయంలో సూర్యుని కరోనా భాగాన్ని పరిశీలించే అద్భుతమైన అవకాశం శాస్త్రవేత్తలకు లభించనుంది. ఎందుకంటే ఇది సాధారణంగా కనిపించదు, గ్రహణ సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories