Upcoming Phones In April: ఈ నెలలో లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. మార్కెట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Upcoming Phones In April: ఈ నెలలో లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. మార్కెట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..!
x

Upcoming Phones In April: ఈ నెలలో లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. మార్కెట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Highlights

Upcoming Phones In April: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? గత నెలలో టెక్ మార్కెట్లోకి అనేక సరికొత్త ఫోన్లు విడుదలయ్యాయి.

Upcoming Phones In April: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? గత నెలలో టెక్ మార్కెట్లోకి అనేక సరికొత్త ఫోన్లు విడుదలయ్యాయి. కంపెనీల నుంచి సరికొత్త ఫోన్లను లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఏప్రిల్ 2025లో కూడా అంతే స్థాయిలో కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరికొత్త మోడల్స్ కోసం మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా సమయం కూడా ఆసన్నమైంది. వివో, మోటో, పోకో సరికొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

Motorola Edge 60 Fusion 5G

మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto Edge 60 Fusion 5Gని రేపు అంటే ఏప్రిల్ 2న దేశంలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ల్యాండింగ్ పేజీ ప్రకారం రాబోయే Moto Edge 60 మోడల్‌లో 1.5K రిజల్యూషన్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.

POCO C71

ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఏప్రిల్ 4 న ప్రారంభించబడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ TUV సర్టిఫికేషన్‌తో 6.88-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే ఉంటుంది. ఈ మొబైల్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది.

Vivo T4 5G

వివో T4 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత Vivo T3 5Gకి సక్సెసర్‌గా దేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మొబైల్ లాంచ్ తేదీ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని సేల్‌కి తీసుకురానుంది. ఈస్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

Vivo V50e 5G

వివో నుండి మరో ఊహించిన స్మార్ట్‌ఫోన్ Vivo V50e 5G ఏప్రిల్ చివరి నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే కంపెనీ దాని లుక్, డిజైన్ గురించి సమాచారాన్ని పోస్ట్ చేసింది. దీని ద్వారా ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని తెలుస్తుంది. అంటే ప్రీమియం సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్ వస్తుందన్న అంచనాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories