
Best Bluetooth Speakers: అదిరిపోయే సౌండ్ క్వాలిటీతో వస్తున్న బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?
Best Bluetooth Speakers: మంచి సంగీతం వినాలన్నా లేదా ఇంట్లోనే పార్టీ చేసుకోవాలన్నా ఒక పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్ ఉండాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో వేల సంఖ్యలో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
Best Bluetooth Speakers: మంచి సంగీతం వినాలన్నా లేదా ఇంట్లోనే పార్టీ చేసుకోవాలన్నా ఒక పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్ ఉండాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో వేల సంఖ్యలో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో మైక్ సౌకర్యం, క్లాసిక్ డిజైన్, బడ్జెట్ ధరలో లభించే టాప్ 5 స్పీకర్ల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ బ్రాండ్ల నుంచి బెస్ట్ ఆప్షన్స్ ఇవే:
1. మివి సూపర్బాక్స్ క్లాసిక్ (Mivi Superbox Classic):
ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన స్పీకర్ ఇదే. అదిరిపోయే శబ్దాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు.
సౌండ్ అవుట్‌పుట్: 120W (అత్యంత శక్తివంతమైనది)
ప్రత్యేకత: ఇందులో అంతర్నిర్మిత (Built-in) సబ్ వూఫర్ ఉండటం వల్ల బేస్ (Bass) అద్భుతంగా ఉంటుంది.
ధర: రూ.4,499
2. బ్లాపంక్ట్ OMG ఆటమ్ (Blaupunkt OMG Atom):
జర్మన్ బ్రాండ్ బ్లాపంక్ట్ నుంచి వచ్చిన ఈ స్పీకర్ చూడటానికి చిన్నగా ఉన్నా, సౌండ్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది.
సౌండ్ అవుట్‌పుట్: 60W
ప్రత్యేకత: ఇది అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ట్రావెలింగ్కు ఇది బెస్ట్ కాంపాక్ట్ స్పీకర్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ధర: రూ.4,999
3. పోర్ట్రోనిక్స్ డాష్ 10 (Portronics Dash 10):
మీకు పాటలు పాడటం ఇష్టపడితే, ఈ స్పీకర్ మీ కోసమే. అలాగే పార్టీల కోసం కూడా ఈ స్పీకర్ పర్ఫెక్ట్ ఛాయిస్‌గా పేర్కొంటున్నారు.
సౌండ్ అవుట్‌పుట్: 50W
ప్రత్యేకత: దీనితో పాటు డ్యూయల్ వైర్లెస్ కరోకే మైక్‌లు ఉచితంగా వస్తున్నాయి.
బ్యాటరీ: 6 గంటల ప్లేటైమ్.
ధర: రూ.4,799
4. జెబ్రానిక్స్ సౌండ్ ఫీస్ట్ 800 (Zebronics Sound Feast 800)
బ్రాండ్ వాల్యూ, నాణ్యమైన సౌండ్ కోరుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు.
సౌండ్ అవుట్‌పుట్: 55W
బ్యాటరీ: 6 గంటల బ్యాటరీ లైఫ్.
ధర: రూ.3,999
5. జస్ట్ కోర్సెకా సోల్ హెవెన్ (Just Corseca Sol Heaven):
తక్కువ బడ్జెట్లో వినూత్నమైన ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక.
సౌండ్ అవుట్‌పుట్: 10W
ప్రత్యేకత: ఇది కేవలం స్పీకర్ మాత్రమే కాదు, ఇందులో 300ml వాటర్ ట్యాంక్ ఉన్న హ్యూమిడిఫైయర్ కూడా ఉంది.
ధర: రూ.2,999
మీ బడ్జెట్, అవసరానికి తగినట్లుగా పైన పేర్కొన్న వాటిలో నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకోండి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




