Recharge: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్‌.. తగ్గనున్న ఛార్జీలు, ఎలాగో తెలుసా.?

Recharge: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్‌.. తగ్గనున్న ఛార్జీలు, ఎలాగో తెలుసా.?
x
Highlights

ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇంటర్నెట్ అవసరం ఉండదు కేవలం కాల్స్‌ మాట్లాడుకుంటే సరిపోతుంది. అలాంటి వారు ప్రస్తుతం ఇంటర్నెట్‌కి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిగో ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఫోన్‌లు ఉండే పరిస్థితి వచ్చింది. అయితే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత రీఛార్జ్‌ ప్లాన్స్‌లో సమూల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫోన్‌ కాల్స్‌కు, ఇంటర్నెట్‌కు సెపరేట్‌గా రీఛార్జ్‌ చేసుకునే వారు. కానీ ప్రస్తుతం అన్నింటికి కలిపి ఒకే ప్లాన్స్‌న అందుబాటులోకి వచ్చాయి. దీంతో అవసరం లేకపోయినా అన్నింటికీ రీఛార్జ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇంటర్నెట్ అవసరం ఉండదు కేవలం కాల్స్‌ మాట్లాడుకుంటే సరిపోతుంది. అలాంటి వారు ప్రస్తుతం ఇంటర్నెట్‌కి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిగో ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను సమూలంగా మార్చడానికి ట్రాయ్‌ శుక్రవారం ‍‌ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. దీంతో జరగనున్న మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

'కన్సల్టేషన్ పేపర్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ (TCPR) 2012' పేరిట విడుదల చేసిన డ్రాఫ్ట్‌లో, మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో పాటు మరికొన్ని మార్పులు కూడా తీసుకురావాలని ట్రాయ్‌ భావిస్తోంది. మొబైల్ ఫోన్‌ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాయిస్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు వేర్వేరు రీఛార్జ్ ఓచర్‌లు తీసుకొచ్చే అంశంపై ట్రాయ్‌ ఈ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది.

ట్రాయ్‌ పేర్కొన్న ఈ అంశాలపై టెలికం పరిశ్రమల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే వేర్వేరు రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి వచ్చే అకవకాశాలు ఉంటాయి. దీంతో వాయిస్, SMS, ఇంటర్నెట్‌ కోసం ఇలా విడివిడిగా ప్లాన్స్‌ అందుబాటులోకి వస్తాయి. దీంతో మనకు అవసరం లేని సర్వీస్‌ కోసం డబ్బులు చెల్లించాల్సి అవసరం ఉండదు. ఈ కారణంగా రీఛార్జ్‌ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ట్రాయ్‌ పేర్కొన్న అంశాలపై టెలికం సంస్థలు ఎలా స్పందిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories