Vivo S30-Vivo S30 Pro Mini: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. రెండు కొత్త ఫోన్లు వస్తున్నాయ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే..!


Vivo S30-Vivo S30 Pro Mini: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. రెండు కొత్త ఫోన్లు వస్తున్నాయ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే..!
Vivo S30-Vivo S30 Pro Mini: వివో మరోసారి తన 'S' సిరీస్‌ను అప్‌డేట్ చేయబోతోంది. మే 29, 2025న చైనాలో Vivo S30,Vivo S30 Pro Mini అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Vivo S30-Vivo S30 Pro Mini: వివో మరోసారి తన 'S' సిరీస్‌ను అప్‌డేట్ చేయబోతోంది. మే 29, 2025న చైనాలో Vivo S30,Vivo S30 Pro Mini అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. రెండు స్మార్ట్‌ఫషోన్లు లాంచ్ వివరాలతో పాటు, వాటి కొన్ని స్పెసిఫికేషన్‌లు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి, ఇది వివో మరోసారి మిడ్ రేంజ్ విభాగవలో బలమైన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతోందని చూపిస్తుంది.
Vivo S30-Vivo S30 Pro Mini Launch Details
వివో మే 29న తన స్వదేశీ మార్కెట్ చైనాలో కొత్త S30 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్ కింద రెండు స్మార్ట్‌ఫోన్‌లు వివో S30, వివో S30 ప్రో మినీ లాంచ్ కానున్నాయి. ఈ రోజున కొత్త వివో 5జీ ఫోన్‌లతో పాటు, కంపెనీ వివో పాడ్ 5 టాబ్లెట్, కొత్త వివో TWS ఎయిర్ 3 వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కూడా పరిచయం చేస్తుంది. ఈ లాంచ్ ఈవెంట్ కంపెనీ మధ్య-సంవత్సర ఫ్లాగ్‌షిప్ రిఫ్రెష్‌లో భాగమని చెబుతున్నారు.
Vivo S30 Specifications
లీక్స్ ప్రకారం.. వివో S30 6.67-అంగుళాల 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ LTPS డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనిలో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 లో పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం, ఇది 50మెగాపిక్సెల్ సోనీ IMX882 కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు, ఇది OIS సపోర్ట్‌తో వస్తుంది. ఈ కెమెరా టెలిఫోటో సామర్థ్యంతో కూడా రావచ్చు. ఫోన్‌లో 6500mAh పెద్ద బ్యాటరీని అందించచ్చు. వివో ఎస్ 30 ఫ్రేమ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారని కూడా లీక్ వెల్లడించింది.
Vivo S30 Pro Mini Specifications
వివో S30 ప్రో మినీ గురించి వెల్లడించిన సమాచారం ప్రకారం.. దీనిలో 6.31-అంగుళాల 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ LTPO ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ ఇవ్వవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కూడా పనిచేస్తుంది.
ఈ కాంపాక్ట్ ఫోన్‌లో 50మెగాపిక్సెల్ సోనీ IMX882 టెలిఫోటో కెమెరా ఉంటుందని, దీనికి OIS సపోర్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దాని డిజైన్‌ను ప్రీమియంగా మార్చడానికి మెటల్ ఫ్రేమ్‌ను ఉపయోగించవచ్చు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire