Vivo V50 Elite Edition Offers: ఈ ఫోన్ కొనాల్సిందే.. వివో వి50 ఎలైట్ ఎడిషన్‌ లాంచ్.. బ్లాస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయ్..!

Vivo V50 Elite Edition Offers: ఈ ఫోన్ కొనాల్సిందే.. వివో వి50 ఎలైట్ ఎడిషన్‌ లాంచ్.. బ్లాస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయ్..!
x

Vivo V50 Elite Edition Offers: ఈ ఫోన్ కొనాల్సిందే.. వివో వి50 ఎలైట్ ఎడిషన్‌ లాంచ్.. బ్లాస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయ్..!

Highlights

Vivo V50 Elite Edition Offers: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన వివో వి50 ఎలైట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Vivo V50 Elite Edition Offers: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన వివో వి50 ఎలైట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఈ స్మార్ట్‌ఫోన్ గురించి చర్చ జరుగుతోంది. వివో తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మీరు ఫోటోగ్రఫీ, సెల్ఫీలు తీసుకోవడం ఇష్టపడితే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చాలా ఇష్టపడతారు. Vivo V50 ఎలైట్ ఎడిషన్‌లో 50MP సెల్ఫీ కెమెరాకు సపోర్ట్‌ను వివో అందించింది.

మీరు ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ప్రీమియం ఫీచర్లతో కూడిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, వివో V50 ఎలైట్ ఎడిషన్ ఉత్తమ ఎంపిక కావచ్చు. ఈ ఫోన్‌లో కంపెనీ గొప్ప డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు పవర్ బ్యాంక్ లాంటి పెద్ద బ్యాటరీని అందించింది. ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Vivo V50 Elite Edition Offers

వివో తన వివో వి50 ఎలైట్ ఎడిషన్‌ను ఒకే వేరియంట్‌లో విడుదల చేసింది. దీనిలో మీకు 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది. దీనిలో కంపెనీ UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ కూడా సపోర్ట్ అందించింది. దీని ధర గురించి మాట్లాడుకుంటే, వివో దీనిని రూ.41,999 ధరకు విడుదల చేసింది.

లాంచ్ ఆఫర్ కింద, కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై వినియోగదారులకు రూ. 3000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. వివో V50 ఎలైట్ ఎడిషన్ రోజ్ రెడ్‌తో లాంచ్ అయింది. మీరు దీన్ని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుండి కొనుగోలు చేయచ్చు. మీరు దీన్ని కొనుగోలు చేసి 6 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్‌తో ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Vivo V50 Elite Edition Specifications

వివో V50 ఎలైట్ ఎడిషన్‌లో కంపెనీ 6.77-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చింది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే 4500 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఇది HDR10+ కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో 512జీబీ పెద్ద స్టోరేజ్‌తో పాటు 12జీబీ ర్యామ్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం, స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 50 + 50 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను చూడచ్చు. ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే పెద్ద 6000mAh బ్యాటరీ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories