Vivo T4 Pro 5G Offer on Flipkart: వివో టీ4 ప్రో 5జీపై భారీ ఆఫర్లు.. రూ.25 వేల బోనస్

Vivo T4 Pro 5G Offer on Flipkart
x

Vivo T4 Pro 5G Offer on Flipkart: వివో టీ4 ప్రో 5జీపై భారీ ఆఫర్లు.. రూ.25 వేల బోనస్

Highlights

వివో టీ4 ప్రో 5జీపై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ ద్వారా రూ.25 వేల వరకు బోనస్, బ్యాంకు తగ్గింపులు లభ్యం.

Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ-కామర్స్ వేదిక Flipkart లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. పండుగ సందర్భంగా ఈ మొబైల్‌ను తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పనితీరు పరంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (4 నానోమీటర్) చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది. గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా రూపుదిద్దుకుంది.

కెమెరా విభాగంలో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 6500 ఎమ్‌ఏహెచ్ సామర్థ్యమైన బ్యాటరీ, 90 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 పై నడుస్తుంది.

8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.26,249 నుంచి ప్రారంభమవుతోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో చెల్లింపు చేస్తే రూ.2,000 వరకు అదనపు తగ్గింపు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా పాత మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.25,000 వరకు బోనస్ పొందవచ్చు. ఈ ఆఫర్లతో ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉందని విక్రయ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories