Vivo V70 Elite Launch: 6500mAh బ్యాటరీ, 50MP+50MP కెమెరా.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వస్తున్న వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్!

Vivo V70 Elite Launch
x

Vivo V70 Elite Launch: 6500mAh బ్యాటరీ, 50MP+50MP కెమెరా.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వస్తున్న వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్!

Highlights

Vivo V70 Elite Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'వివో' మరో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 'వివో వీ70 ఎలైట్'ను ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Vivo V70 Elite Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'వివో' మరో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 'వివో వీ70 ఎలైట్'ను ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్‌పై టెక్ వర్గాల్లో భారీ బజ్ ఏర్పడింది. ప్రీమియం డిజైన్‌తో పాటు టాప్ లెవల్ స్పెసిఫికేషన్లు ఉండటంతో.. ఇది హైఎండ్ సెగ్మెంట్‌లో మంచి పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. 6500mAh బ్యాటరీ, 50MP+50MP కెమెరాలతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. వివో వీ70 ఎలైట్ లీక్ ఫీచర్స్ ఓసారి తెలుసుకుందాం.

వివో వీ70 ఎలైట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్.. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు స్మూత్ అనుభూతిని అందిస్తుంది. విజువల్స్ మరింత వైబ్రెంట్‌గా కనిపించేలా ఈ డిస్‌ప్లే రూపొందించారని సమాచారం. 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెనెరేషన్ 3 ప్రాసెసర్ ఉండనుంది. ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును అందించే చిప్‌సెట్ కావడంతో.. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్, ఏఐ ఫీచర్లలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఈ ఫోన్‌లో రన్ అవుతుంది.

కెమెరా విభాగంలో వివో వీ70 ఎలైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50MP 3x టెలిఫోటో కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. సెల్ఫీ లవర్స్ కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా అందించనున్నారు. ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌లో వినియోగదారులకు మంచి ఎక్సపీరియెన్స్ ఇవ్వనుంది. ఇందులో 6,500mAh భారీ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఒక రోజు కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుంది. మొత్తంగా ఈ ఫోన్ ఒక పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ అన్నింటిలోనూ బ్యాలెన్స్‌డ్ స్పెసిఫికేషన్లతో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న ఈ ఫోన్‌పై టెక్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అధికారిక లాంచ్ తేదీ, ధర వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories