Vivo X200T: వివో X200T.. మూడు ట్రిపుల్ కెమెరాలు.. అదిరిపోయే ఫీచర్స్..!

Vivo X200T: వివో X200T.. మూడు  ట్రిపుల్ కెమెరాలు.. అదిరిపోయే ఫీచర్స్..!
x

Vivo X200T: వివో X200T.. మూడు ట్రిపుల్ కెమెరాలు.. అదిరిపోయే ఫీచర్స్..!

Highlights

Vivo X200T: వివో భారత మార్కెట్లో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Vivo X200T: వివో భారత మార్కెట్లో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. Vivo X200T పేరుతో ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ జనవరి 27న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇంతకుముందే వివో భారత్‌లో Vivo X200 మరియు Vivo X200 Pro మోడళ్లను విడుదల చేసింది. అనంతరం తక్కువ ధరలో Vivo X200 FEను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా Vivo X200Tను తీసుకురానుంది.

Vivo X200Tలో జైస్ (ZEISS) భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కెమెరా సెటప్ ఫోటోగ్రఫీ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉండనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌కు శక్తినిచ్చే హృదయంగా MediaTek Dimensity 9400+ ప్రాసెసర్ పనిచేయనుంది. ఇది హై-పెర్ఫార్మెన్స్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. Vivo X200Tలో 6200mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Vivo X200T ధర రూ.50,000 నుంచి రూ.55,000 మధ్యలో ఉండే అవకాశముందని సమాచారం. అయితే, దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ స్టెల్లార్ బ్లాక్ మరియు సీసైడ్ లిలాక్ రంగుల్లో లభించనుంది. అయితే, Vivo X200Tను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. మొత్తంగా టెక్ ప్రియులు ఈ ఫోన్‌పై భారీ అంచనాలతో ఎదురుచూస్తుండగా, లాంచ్ అనంతరం మార్కెట్‌లో ఇది ఎలాంటి స్పందన పొందుతుందో చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories