Xiaomi 17T Series: షియోమీ కొత్త సంచలనం.. గ్లోబల్ మార్కెట్లోకి 'Xiaomi 17T' సిరీస్!

Xiaomi 17T Series
x

Xiaomi 17T Series: షియోమీ కొత్త సంచలనం.. గ్లోబల్ మార్కెట్లోకి 'Xiaomi 17T' సిరీస్!

Highlights

Xiaomi 17T Series: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ తన 'T' సిరీస్‌లో సరికొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ సిరీస్‌లో Xiaomi 17T, 17T Pro ఫోన్లు ఉండనున్నాయి.

Xiaomi 17T Series: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ తన 'T' సిరీస్‌లో సరికొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ సిరీస్‌లో Xiaomi 17T, 17T Pro ఫోన్లు ఉండనున్నాయి. గత తరం మోడళ్ల కంటే మెరుగైన డిజైన్, మరింత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్లోబల్ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా కెమెరా, బ్యాటరీ విభాగాల్లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్లు వివిధ సర్టిఫికేషన్ సైట్లలో కనిపిస్తుండటంతో, త్వరలోనే వీటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ గురించి. లీకైన వివరాల ప్రకారం, Xiaomi 17Tలో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. గత ఏడాది వచ్చిన Xiaomi 15Tలోని 5,500mAh బ్యాటరీతో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పాలి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరాటంకంగా పనిచేసేలా దీనిని డిజైన్ చేశారు. అయితే, ఛార్జింగ్ వేగంలో మాత్రం పెద్దగా మార్పు లేదు. ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది. బ్యాటరీ సైజు పెరిగినా, ఫోన్ స్లిమ్‌గా ఉండేలా కొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం షియోమీ ఈసారి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ప్రైమరీ సెన్సార్ ఉండబోతోంది. దీంతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, శాంసంగ్ నుంచి సేకరించిన 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వంటివి ఉండనున్నాయి. సెల్ఫీల కోసం కూడా 50 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ కెమెరా సెటప్ ద్వారా 8K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా మీడియాటెక్ నుంచి వచ్చిన లేటెస్ట్ 'డైమెన్సిటీ 9500s' చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో వాడుతున్నారు. ఈ చిప్‌సెట్ కేవలం వేగాన్నే కాకుండా, అత్యాధునిక 'అజెంటిక్ ఏఐ' జనరేటివ్ ఏఐ ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లో ఇది స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ ప్రాసెసర్ ద్వారా ఫోన్ వేడిక్కకుండా ఉండేందుకు ప్రత్యేక కూలింగ్ మెకానిజంను కూడా షియోమీ జోడించినట్లు తెలుస్తోంది. హైపర్ ఓఎస్ 3.0 ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది.

సాధారణంగా షియోమీ తన 'T' సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ నెలలో లాంచ్ చేస్తుంటుంది. కానీ, ఈసారి వ్యూహాన్ని మార్చి ఫిబ్రవరి 2026లోనే గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. అదే జరిగితే శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి 'Xiaomi 17T' ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇండియాకు సంబంధించిన మోడల్ నంబర్లు కూడా ఐఎంఈఐ డేటాబేస్‌లో కనిపించడమే దీనికి ప్రధాన కారణం.

Show Full Article
Print Article
Next Story
More Stories